చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళ్లెదుటే పత్తి రైతు గగ్గోలు పెడుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి. ఒక మంత్రి ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కానీ, అక్కడ జరుగుతున్న దోపిడీని ప్రశ్నించకపో | - | Sakshi
Sakshi News home page

చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కళ్లెదుటే పత్తి రైతు గగ్గోలు పెడుతున్నా ఒక్కరంటే ఒక్కరు కూడా స్పందించని పరిస్థితి. ఒక మంత్రి ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు కానీ, అక్కడ జరుగుతున్న దోపిడీని ప్రశ్నించకపో

Nov 19 2025 5:31 AM | Updated on Nov 19 2025 5:31 AM

చెప్ప

చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్

జిల్లా మొత్తానికి ఒక్కటే కొనుగోలు కేంద్రం

రెండు రోజులుగా బారులు తీరుతున్న దిగుబడులు

స్లాట్‌ బుకింగ్‌ సమస్యతో మొదలుకాని కొనుగోళ్లు

వ్యయప్రయాసలుపడి వస్తున్న రైతులు

ఎకరాకు 4 క్వింటాళ్లే కొంటామని మెలిక

చోద్యం చూస్తున్న సీసీఐ అధికారులు

ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేయలేం

కొనుగోలు కేంద్రం ఏర్పాటైన మురారీ పవన్‌ ఆగ్రోటెక్‌ సముదాయం

నంద్యాల(అర్బన్‌): పత్తి రైతు కష్టాన్ని కొనుగోలు కేంద్రాలు నిలువునా దోచేస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 15రోజులుగా 9 కేంద్రాలు తెరిచి పత్తి కొనుగోలు చేస్తుండగా.. నంద్యాల జిల్లాలో ఒకే ఒక్క కొనుగోలు కేంద్రాన్ని గత సోమవారం మంత్రి ఫరూక్‌ ప్రారంభించారు. మంత్రి అండదండలు ఉన్నాయనో, లేక అడిగేవారు ఎవరనో కానీ మురారీ పవన్‌ ఆగ్రోటెక్‌ ఆధ్వర్యంలో సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం యాజమాన్యం రైతులకు చుక్కలు చూపుతోంది. జిల్లాలో పత్తి సాధారణ సాగు 23,516 హెక్టార్లు కాగా.. తెగుళ్లు, ఇతరత్రా సమస్యలతో ఈ ఏడాది 7,211 హెక్టార్లలోనే సాగయింది. మామూలుగా 15 నుంచి 17 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా తుపాను ప్రభావంతో దిగుబడి 8 నుంచి 10 క్వింటాళ్లకు పడిపోయింది. ఇదిలాఉంటే ఎకరాకు 7 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామని సీసీఐ అధికారులు ఘనంగా ప్రకటించారు. ఆ మేరకు రైతులు కపాస్‌ కిసాన్‌ యాప్‌, సీఎం యాప్‌ల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. నంద్యాల మురారీ పవన్‌ ఆగ్రోటెక్‌లో ఏర్పాటైన సీసీఐ కొనుగోలు కేంద్రానికి గత రెండు రోజులుగా రైతులు దిగుబడులతో బారులు తీరుతున్నారు. అయితే స్లాట్‌ బుకింగ్‌లో ఏర్పడ్డ సమస్యలు పరిష్కారమైతేనే పత్తి కొనుగోలు చేస్తామంటూ యాజమాన్యం చేతులెత్తేయడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. రెండు రోజులుగా తిండీతిప్పలు మాని ఎప్పుడు కొనుగోలు చేస్తారోనని నిరీక్షిస్తున్నారు.

కర్నూలు జిల్లాలో

15 రోజులుగా కొనుగోళ్లు

గత 15రోజులుగా కర్నూలు జిల్లాలో 9 కేంద్రాలు తెరిచి పత్తి కొనుగోళ్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకు 10 క్వింటాళ్ల చొప్పున 60 వేల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారు. నంద్యాలలో కేంద్రం ప్రారంభించినా ఇప్పటి వరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయని పరిస్థితి. స్లాట్‌ ఓపెన్‌ కాకున్నా నాలుగు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయడానికి అనుమతి ఉందని నిర్వాహకులు రైతులను మభ్యపెడుతున్నారు. ఇదేమని రైతులు ప్రశ్ని స్తే ఇష్టమైతే అమ్ముకో, లేదంటే నీ సరుకు నువ్వు తీసుకుపో అనే బెదిరింపులకు దిగుతున్నారు. రెండు రోజులుగా ఈ పరిస్థితి నెలకొన్నా మంత్రులు కానీ, జిల్లా అధికారులు ఎవరూ సమస్యకు పరిష్కారం చూపకపోవడం గమనార్హం.

కొనుగోళ్లు ‘తెల్ల’బోయి!

స్లాట్‌ బుకింగ్‌ సమస్య

పత్తి పండించిన రైతులు మొదట కపాస్‌ కిసాన్‌ యాప్‌, సీఎం యాప్‌లలో రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంది.

జిన్నింగ్‌ సామర్థ్యాన్ని బట్టి సీసీఐ అధికారులు స్లాట్‌ ఇవ్వాలి.

ప్రస్తుతం జిన్నింగ్‌ సామర్థ్యంలో 50శాతానికి కూడా స్లాట్‌ బుకింగ్‌ జరగని పరిస్థితి.

ఏడు క్వింటాళ్లు కొనుగోలు చేస్తామన్న అధికారులు ప్రస్తుతం నాలుగు క్వింటాళ్లేనని మొండికేస్తున్నారు.

అది కూడా స్లాట్‌ బుకింగ్‌ ఓపెన్‌ అయిన తర్వాతే కొనుగోళ్లు మొదలు పెడతామని మెలిక పెట్టడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది.

రోడ్డునపడ్డ పత్తి రైతన్న

స్లాట్‌ సమస్య కారణంగానే కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. సమస్య కొలిక్కి వస్తే 4 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తాం. ఏడు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు అంశాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. అనుమతులు వస్తే ఆ దిశగా చర్యలు తీసుకుంటాం.

– రహమాన్‌, మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌

చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్1
1/1

చెప్పుకోవడానికి జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement