పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలి
● అధికారులతో జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల: సింగిల్ డెస్క్ విధానం ద్వారా జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం పట్టణంలోని డ్వామా కార్యాలయంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం ఆమె అధ్యక్షతన జరిగింది. ఇందులో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గత త్రైమాస కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు కోరుతూ మొత్తం 686 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో ఆయా శాఖల ద్వారా 652 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశారన్నా రు. పరిశీలనలో ఉన్న మిగతా 32 దరఖాస్తులను కూడా నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం కోసం ఉత్పాదన సేవా రంగాల్లో 4 యూనిట్లకు మొత్తం రూ. 11.14 లక్షల విలువైన రాయితీ ప్రయోజనాల జారీకి కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఎస్ మహబూబ్ బాషా, ఎల్‌డీఎం రవీందర్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కిశోర్‌రెడ్డి, డీపీఓ లలిత భాయ్, రవా ణా శాఖ అధికారి శివారెడ్డి, పరిశ్రమల అసోసియేషన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


