
పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం
పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం దాడులు చేయడం హేయం. సాక్షి ఎడిటర్‌పై, ఇతర జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలను మార్చే శక్తి అక్షరానికి ఉన్నదని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంలా ఉన్న పత్రికా రంగంపై ఇలా దాడులు చేయడం, కేసులు నమోదు చేయడం మంచి పద్ధతి కాదు. జర్నలిస్టులు వారు చూస్తున్న, జరుగుతున్న అన్యాయాలను పత్రికా ముఖంగా వెలుగులోకి తెస్తారు. దీన్ని తప్పుగా భావించి కేసులు పెట్టడం సరికాదు.
– జనార్దన్‌రెడ్డి, సీనియర్ పాత్రికేయులు, నంద్యాల
నకిలీ మద్యంపై కథనాలు రాసిన జర్నలిస్టులు నోటీసులు ఇవ్వడం కక్ష సాధింపు చర్యలో భాగమే. స్వేచ్ఛగా జర్నలిస్టులు వార్తలు రాస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది. అవినీతి, అక్రమాలను ప్రశ్నించే జర్నలిస్టులకు సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. అక్రమ మద్యంపై కథనాలు రాసిన జర్నలిస్టులపై కేసులు బనాయించడం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడటమే.
–బోయ పులికొండన్న,
ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు, నంద్యాల

పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం