కర్నూలు(అర్బన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జెడ్పీ సీఈఓ జి.నాసరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన స్థానిక సమావేశ భవనంలో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందన్నారు. సమావేశంలో వ్యవసాయం – అనుబంధ శాఖలు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ, మత్స్యశాఖ, దేవదాయ శాఖలపై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్లు, జెడ్పీటీసీ, ఎంపీపీలు సమావేశానికి హాజరు కావాలని ఆయన కోరారు.
పీఏసీఎస్‌ల్లో అడ్డగోలుగా
ఉద్యోగుల నియామకం
ఇష్టానుసారంగా
గౌరవ వేతనాల చెల్లింపు
నిర్వీర్యమైన ప్యాక్స్ డెవలప్‌మెంటు సెల్
ఉమ్మడి జిల్లాలో 70 సంఘాల్లో నష్టాలు