
ఇద్దరు యువకుల దుర్మరణం
కోడుమూరు రూరల్: కోడుమూరు–కర్నూలు రోడ్డులో నెరవాడ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గూడూరు మండలం చనుగొండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు.. చనుగొండ్లకు చెందిన ఏబెల్ కుమారుడు శాంతి రాజు(20), యిర్మీయా కుమారుడు శివ(18) కర్నూలులో ఒకరు ఏసీ మెకానిక్, మరొకరు తాపీ మేసీ్త్రగా పని చేస్తున్నారు. వారిద్దరూ కలిసి మంగళవారం రాత్రి కర్నూలు నుంచి బైక్‌పై స్వగ్రామం చనుగొండ్లకు బయలుదేరారు. మార్గమధ్యలో నెరవాడ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. వాహనదారులు గమనించి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా కోలుకోలేక యువకులిద్దరూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కె.నాగలాపురం ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా చేతికొచ్చిన కుమారులను రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించడంతో కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు వర్ణణాతీతం.
మృతిచెందిన శాంతిరాజు, శివ

ఇద్దరు యువకుల దుర్మరణం