శ్రీశైలంటెంపుల్: శ్రీశైలక్షేత్ర పాలకుడైన బయలువీరభద్రస్వామికి గురువారం అమావాస్య సందర్భంగా విశేషార్చన చేపట్టారు. ఈ అర్చనను పరోక్ష సేవగా జరిపించుకునేందుకు దేవస్థానం దేవస్థానం కల్పించడంతో వివిధ ప్రాంతాల నుంచి 27 మంది భక్తులు పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు మహాగణపతిపూజ జరిపారు. అనంతరం పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్దజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం నిర్వహించారు. ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించబడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్దిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
చౌడేశ్వరీదేవికి విశేష పూజలు
బనగానపల్లె రూరల్: మండలంలోని నందవరం చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించా రు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పీవీ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు జరిగాయి. ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి పల్లకిసేవ, సహస్రదీపాలంకరణ సేవ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాన్ని పంపిణీ చేశారు.
వర్షాలతో అప్రమత్తం
నంద్యాల: జిల్లాలో కురు స్తున్న వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు నిర ంతరంగా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రటకనలో హెచ్చరించారు. వాతావరణ శాఖ సూచనలు దృష్టిలో ఉంచుకొని ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాల్లో పిల్లలను ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాలలు, కళాశాలలు, రెసిడెన్షియల్ ఇన్‌స్టిట్యూట్‌లలోని శిథిలావస్థలో ఉన్న గదులలో తరగతులు నిర్వహించవద్దన్నారు. మట్టి ఇళ్లలో ప్రజలు ఉండడానికి అనుమతించరాదని, దీనిని పక్కగా పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయాల్లో అధికారులు అలసత్వం వహిస్తే తీవ్రంగా పరిగణించి చర్యలు తీసుకుంటామన్నారు.
పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదల పెంపు
జూపాడుబంగ్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి నీటి విడుదలను 20వేల నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచినట్లు ఏఈ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయంలోకి 1,01,785 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతుండగా డ్యాంలో 883.10 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు వద్ద 882.10 అడుగుల నీటిమట్టం నమోదు కాగా హెడ్‌రెగ్యులేటర్ 2,4,5,6,7 గేట్ల ద్వారా 30వేల క్యూసెక్కుల నీటిని ఎస్సారెమ్సీ కాల్వలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నుంచి తెలుగుగంగ కాల్వకు 11 వేల క్యూసెక్కులు, ఎస్సార్‌బీసీ(జీఎన్‌ఎస్‌ఎస్)కాల్వకు 10 వేలు, కేసీ ఎస్కేప్ కాల్వకు 9వేల క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు బానకచర్ల ఏఈ దేవేంద్ర తెలిపారు.
పరోక్షసేవగా బయలువీరభద్రస్వామికి విశేషపూజ
పరోక్షసేవగా బయలువీరభద్రస్వామికి విశేషపూజ
పరోక్షసేవగా బయలువీరభద్రస్వామికి విశేషపూజ