
ఈరన్న స్వామి.. నమోనమామి!
● ఉరుకుందలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభం
కౌతాళం: ఉరుకుంద ఈరన్నస్వామి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాలు శుక్రవారం ప్రార ంభం అయ్యాయి. తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ, మహామంగళ హారతి, పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులను దర్శనానికి వదిలారు. రాత్రి 8 గంటలకు ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దీపారాధన చేశారు. గోవు పూజ అనంతరం ఆలయ గోపురంపై స్వామి జెండాను ఆవిష్కరించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామి సన్నిధిలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈరన్న స్వామి.. నమోనమామి.. అని వేడుకున్నారు. శ్రావణ మాస ఉత్సవాలు ఆగస్టు 23 వరకు కొనసాగుతాయని ఆలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తెలిపారు.