
నిర్లక్ష్యానికి మూత‘బడి’
రుద్రవరం: కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుండటంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. పాఠశాలల పునఃప్రారంభంలో అడ్మిషన్లపై చొరవ చూపకపోవడం, ఖాళీగా ఉన్న స్థానాలకు ఉపాధ్యాయులను నియమించకపోవడం, ఏకోపాధ్యాయ పాఠశాలలపై పర్యవేక్షణ లేకపోవడంతో సర్కారు బడులు మూతబడుతున్నాయి. రుద్రవరం మండలంలో ఇప్పటికే రెండు పాఠశాలలకు తాళం వేయగా, మరి కొన్ని మూసివేత దిశగా అడుగు లు పడుతున్నాయి. ఈ ఏడాది కొత్తగా 1వ తరగతికి విద్యార్థులు చేరక పోవడం, ఆపై తరగతిలో ఉన్న ఒక రు ఇద్దరు బయటి పాఠశాలల్లో చేరడంతో డీ.కొట్టాల పంచాయతీ మజరా గ్రామమైన టీ.కొట్టాల, మరొకటి పెద్దకంబళూరు పంచాయతీ మజరా పందిర్లపల్లె గ్రా మాల్లోని ప్రభుత్వ పాఠశాలలు రెండు మూత పడ్డా యి. పాఠశాలలల్లో సరైన వసతులు లేక పోవడం, కూటమి ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించలేక పోవడంతో పాఠశాలలు మూత పడుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో నాడు – నేడు పేరుతో ప్రభుత్వ పాఠశాలలు కళకలాడాయి. కూటమి ప్రభుత్వం పాఠశాలను నిర్లక్ష్యం చేయడంతో ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. రుద్రవరం మండలంలో మొత్తం 60 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ ఏడాది వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాక కొన్ని పాఠశాలల్లో 1వ తరగతికి విద్యార్థుల నమోదు సంఖ్య అరకొరగా ఉంది. మరికొన్ని పాఠశాలల్లో ప్రవేశాలు లేవు. అలాగే కొన్ని పాఠశాలల్లో 2, 3, 4, 5 తరగతులకు సంబంధించి విద్యార్థులు అరకొరగా ఉండటంతో ఉపాధ్యాయులు పట్టించుకోరని భావించిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇతర పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. దీంతో ఉన్న విద్యార్థుల సంఖ్య తగ్గి ఇప్పటికి రెండు మూత పడ్డాయి. ఆర్.కొత్తపల్లెలో 10 మంది, ఎల్లావత్తుల స్పెషల్‌లో ఏడుగురు, చిన్నకంబళూరు స్పెషల్లో ఆరుగురు చొప్పున మాత్రమే విద్యార్థులు ఉన్నారు. ఇలా విద్యార్థుల సంఖ్య పూర్తిగా తగ్గి పోతు బడులు మూసివేతకు గురవుతున్నాయి.
టీ.కొట్టాల, పందిర్లపల్లె
పాఠశాలలకు తాళాలు
మరో మూడు పాఠశాలల్లో
పది లోపు విద్యార్థులు

నిర్లక్ష్యానికి మూత‘బడి’

నిర్లక్ష్యానికి మూత‘బడి’