
కలుగొట్ల‘పల్లె’కు వెళ్లాలంటే తిప్పలే..
ఇక్కడ షెడ్డు నిర్మాణం చేపట్టిన ఈ స్థలం పాత హైవే నుంచి కలుగొట్లపల్లె రహదారికి సంబంధించినది. చాగలమర్రి నుంచి కలుగొట్లపల్లెకు వెళ్లేందుకు అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీటీ రోడ్డుకు అనుసంధానంగా కొంత దూరం సీసీ రోడ్డు వేశారు. మంచి సెంటర్‌లో ఉండటంతో ఇక్కడ వ్యాపారం చేసుకోవాలని ఆలోచించిన టీడీపీ నేత అక్కడ రోడ్డు సైడుకు ఉన్న చిన్న బంకులను తీసివేయించాడు. తర్వాత సగం రోడ్డుకు అడ్డంగా షాపింగ్ గది కట్టుకున్నాడు. ఇప్పుడు కలుగొట్లపల్లె గ్రామంతో పాటు అటువైపు ఉన్న బైపాస్ రోడ్డు, ఇత గ్రామాలకు వెళ్లాంటే చుట్టు తిరిగి వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.