
‘గిరి గీసి..’ బరితెగించి..!
● రెచ్చిపోతున్న ‘పచ్చ బ్యాచ్’
● చాగలమర్రిలో
టీడీపీ నేతల బరితెగింపు
● రూ. కోట్ల విలువైన
గ్రామ కంఠం స్థలాలు కబ్జా
● అధికార యంత్రాంగాన్ని గుప్పిట్లో
పెట్టుకుని ఇష్టారాజ్యం
● చేష్టలుడిగి చూస్తున్న పంచాయతీ,
రెవెన్యూ, ఆర్‌అండ్‌బి, ఇరిగేషన్ శాఖలు
ఇక్కడ దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం వేసిన ఈ బేస్‌మెంట్ ఎవరో ప్రైవేటు స్థలం కొనుగోలు చేసి అన్ని అనుమతులు తీసుకుని నిర్మాణం చేస్తున్నారనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇది చాగలమర్రి పట్టణంలోని కడప, కర్నూలు జాతీయ రహదారి పక్కన మల్లెవేముల చౌరస్తాలో అత్యంత విలువైన ఆర్ అండ్‌బీ స్థలం. ఇక్కడి నుంచి గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ నిర్మించేందుకు ఖాళీగా ఉంచిన స్థలం. ఈ స్థలంపై కన్నుపడిన ‘తమ్ముడు’ అక్కడ అనధికారికంగా ఉన్న చిన్న వ్యాపారులను, బంకులను, ఆటో స్టాండును దౌర్జన్యంగా ఖాళీ చేయించారు. ఆ వెంటనే అక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం రాత్రికి రాత్రి పునాదులు తీసి బేస్‌మెంట్ కూడా వేశారు. ఈ నిర్మాణం పూర్తయితే నెలనెలా రూ. లక్షల్లో బాడుగలు వస్తాయని సమాచారం. అయితే ఇంత బహిరంగంగా ప్రభుత్వ స్ధలంలో అనధికారిక నిర్మాణం జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. నిత్యం ఈ రహదారి వెంట రాకపోకలు సాగిస్తున్న మండల స్థాయి నుంచి జిల్లా అధికారుల వరకు చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ చిత్రం పెద్ద ఇనుప గేటు వేసింది ఇంటికి కాదు. టీడీపీ నేత కొలిమి హుస్సేన్‌వలి తన ఇంటి పక్కన ఉన్న గ్రామ కంఠానికి సంబంధించిన వీధి రస్తాకు. ఈ రస్తా మీదుగా ప్రధాన రహదారి నుంచి మంగళి వీధిలోకి నిత్యం వందలాది మంది రాకపోకలు కొనసాగించేవారు. తెలుగు తమ్ముడు తన ఇంటి పక్కనే ఉన్న ఈ రహదారిని ఆక్రమించుకుని రాకపోకలు బంద్ చేయించి కేవలం తమ ఇంటికి మాత్రమే ఉండేలా ఏకంగా పెద్ద ఇనుప గేట్ వేయించుకున్నాడు. దీంతో గ్రామ కంఠానికి సంబంధించిన విలువైన స్థలం కబ్జాకు గురైనా ఎవరూ అడిగే పరిస్థితి లేదు. ఆ వీధుల్లోని ప్రజలు ప్రధాన రహదారిలోకి రావాలంటే చుట్టూ తిరిగి రావల్సిన దుస్థితి నెలకొంది.
ఖాళీ జాగా .. వేసేయ్ పాగా..!

‘గిరి గీసి..’ బరితెగించి..!