తీర్మానాల తిరస్కరణపై విచారణ
కోవెలకుంట్ల: మండల పరిషత్ పాలక మండలి అనుమతి లేకుండా వివిధ అభివృద్ధి పనులపై అధికారులు ఏక పక్షంగా తీర్మానం, వాటిని ఎంపీపీ తిరస్కరణ చేయడం తదితర విషయాలపై గరువారం జెడ్సీ సీఈఓ నాసర రెడ్డి విచారణ చేపట్టారు. వివిధ గ్రామాలో డ్రైనేజీ నిర్మాణానికి రూ.26 లక్షల మండల పరిషత్ నిధు లు మంజూరు చేయాలని నివేదిక పంపారు. ఆ తీర్మానాలను ఎంపీపీ తిరస్కరించడంతో జెడ్పీ సీఈఓ నాసర రెడ్డి గురువారం ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా జెడ్పీ సీఈఓ మాట్లడుతూ.. పాలక మండలి అనుమతి లేకుండా తీర్మానాలు చేయడం, వాటిని ఎంపీపీ తిరస్కరించడం తదితర అంశాలపై ఎంపీపీ భీమిరెడ్డి రమాదేవి, ఎంపీడీఓ వరప్రసాద్‌రావును విచారణ చేశామని, తుది నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పిస్తామన్నారు.


