బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి
● రూ.1.30 లక్షల ఆదాయం
కొలిమిగుండ్ల: భూగర్భంలో అవతరించిన బెలుం గుహల సహజ అందాలను తిలకించేందుకు పర్యాటకులు క్యూకట్టారు. ఆదివారం సెలవు దినం కావడంతో కర్ణాటకతో ఇతర ప్రాంతాల నుంచి యాత్రికులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. గుహ లోపల పర్యాటకులతో రద్దీగా మారింది. గుహ లోపల ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అందాలను తిలకించి వాటి గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పర్యాటకులు ఎక్కువ మంది రావడంతో గుహలకు రూ.1.30 లక్షల మేర ఆదాయం సమకూరినట్లు సిబ్బంది తెలిపారు.
నేడు కలెక్టరేట్ ఆవరణలో రెవెన్యూ క్లినిక్స్
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): జిల్లాలో ప్రజలు ఎదు ర్కొంటున్న వివిధ రెవె న్యూ సమస్యలకు త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ నెల 29వ తేదీన సోమవారం కలెక్టరేట్ ఆవరణలో జిల్లా స్థాయి రెవెన్యూ క్లినిక్స్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలో ఏడు రెవెన్యూ క్లినిక్స్ ఏర్పాటు చేసి, ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించి నమోదు చేయడంతో పాటు, సమస్యల స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపడతామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు హాజరై ప్రజలకు సేవలు అందిస్తారన్నారు. రెవెన్యూ, అడంగల్ సవరణలు, 22ఏ – చుక్కల భూముల క్రమబద్ధీకర ణ, అసైన్డ్ భూములు–భూ ఆక్రమణలు, రెవె న్యూ కోర్టు కేసులు, సర్వే–రీ సర్వే, దేవదాయ–వక్ఫ్ భూముల సమస్యలకు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ప్రజల అర్జీలకు వేగవంతమైన పరిష్కారం అందిస్తామన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
జిల్లాలో ‘మీ ఇంటికి.. మీ డాక్టర్’
● రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహణ
నంద్యాల(అర్బన్): జిల్లాలోని చెంచు గూడేల్లోని గిరిజనలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ‘మీ ఇంటికి మీ డాక్టర్’ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా అధ్యక్షురాలు రాజకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, న్యూఢిల్లీకి చెందిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఫౌండేషన్ ఆర్థిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అమలు చేయనుందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి మొదటి వారంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. ఈ ప్రాజెక్టును మూడేళ్ల పాటు అమలు కానుందన్నారు. మొబైల్ హెల్త్ క్లినిక్ నిర్వహణ నిమిత్తం డాక్టర్, నర్స్, ఫార్మసిస్ట్, డ్రైవర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తులను redcrossnandyal@gmail.com, redcrossap@gmail.comకు జనవరి 15లోపు పంపాలని సూచించారు.
ఆదోని జిల్లా కోసం ఉద్యమం
ఆదోని టౌన్: ఆదోని జిల్లా కోసం ఐక్యంగా ఉద్య మం చేస్తున్నామని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు కృష్ణమూర్తిగౌడ్, వీరేష్, వీరేష్, రఘురామయ్య పేర్కొన్నారు. ఆదోని పట్టణంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారానికి 43వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆదోనిని తక్షణమే జిల్లాగా ప్రకటించాలని, లేని పక్షంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.
నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
కర్నూలు(అగ్రికల్చర్): విద్యుత్ భవన్‌లో సోమ వారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమా న్ని నిర్వహిస్తున్నట్లు సూపరింటెండింగ్ ఇంజినీర్ ఆర్.ప్రదీప్‌కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తాము ఎదుర్కొ ంటున్న విద్యుత్ సమస్యలను 7382614308కు ఫోన్ చేసి చెప్పవచ్చన్నారు.
బెలుం గుహలకు పర్యాటకుల తాకిడి


