ప్రభుత్వ భూములను ఆక్రమించొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ భూములను ఆక్రమించొద్దు

Jun 4 2026 5:22 AM | Updated on Jun 4 2026 5:22 AM

నల్లగొండ : ప్రభుత్వ భూములు, చెరువుల శిఖాలను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఆర్డీఓలు, తహసీల్దార్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న సాదాబైనామా దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. భూభారతి సంబంధిత కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేవ/ంచారు. డివిజన్‌ స్థాయిలో నిర్వహిస్తున్న ప్రజావాణిలో వచ్చిన సమస్యలు స్థానికంగానే పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇకపై తాను డివిజన్‌ స్థాయి ప్రజావాణి కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పారు. అటవీ, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన భూముల సర్వేను వేగవంతం చేసి, భూ రికార్డులను సమగ్రంగా రూపొందించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, జిల్లా రెవెన్యూ అధికారి దశరథ్‌నాయక్‌, ల్యాండ్‌ సర్వే ఏడీ ధీరజ్‌ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలల మరమ్మతు పూర్తి చేయాలి

పాఠశాలల్లో చేపట్టిన మరమ్మతు పనులను 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎంఈఓలు, ఆర్‌సీఓలు, సంక్షేమ శాఖ ఆర్‌డబ్ల్యూఎస్‌, రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, ఫర్నిచర్‌ తదితర మౌలిక వసతులు సిద్ధంగా ఉండేలా చూడాలన్నారు. స్కూల్‌ బస్సుల ఫిట్‌నెస్‌ పరీక్షలను పూర్తిచేసి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు యూనిఫాం అందజేయాలన్నారు. 12 లోపు విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు అందించాలని ఆదేశించారు. తెలంగాణ పబ్లిక్‌ మోడల్‌ స్కూల్‌ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి దశరథ, స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ వై.అశోక్‌రెడ్డి, డీఈఓ సుశీందర్‌రావు, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement