ధరలు తగ్గించాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ధరలు తగ్గించాలని నిరసన

Jun 4 2026 5:22 AM | Updated on Jun 4 2026 5:22 AM

నకిరేకల్‌ : పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ తగ్గించడంతో పాటు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్‌లో ఎడ్లబండ్లతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆప్‌ రాష్ట్ర అధ్యక్షురాలు హేమ సుదర్శన్‌ మాట్లాడుతూ ఇందన ధరల భారంతో ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలపై పన్నులను తగ్గించి ఉపశమనం కలిగించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యార శ్రీనివాస్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బుర్ర రాముగౌడ్‌, జనరల్‌ సెక్రటరీ డాక్టర్‌ అన్సారి, నాయకులు దర్శనం రమేష్‌, పురుషోత్తంరెడ్డి, కొడంగల్‌ శ్రీనివాస్‌, బాబూలాల్‌, రాకేష్‌రెడ్డి, రాజమల్లయ్య, అద్దంకి రవీందర్‌, అశోక్‌, మహేందర్‌, ఎల్లమ్మ, లక్ష్మి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement