సాగర్‌లో అటవీశాఖ సైకిల్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌లో అటవీశాఖ సైకిల్‌ ర్యాలీ

Jun 4 2026 5:22 AM | Updated on Jun 4 2026 5:22 AM

నాగార్జునసాగర్‌ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని ఫారెస్ట్‌ డివిజనల్‌ అధికారి సంగీత అన్నారు. బుధవారం నందికొండ మున్సిపాలిటీ పరిధిలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సైకిల్‌ ర్యాలీని ఆమె జెండాను ఊపి ప్రారంభించి మాట్లాడారు. ప్రతి సంవత్సరం జూన్‌ 3వ తేదిన అంతర్జాతీయ సైకిల్‌ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు వృక్ష సంపదను రక్షించుకోవాలని, మొక్కలు పెంచాలని కోరారు. కార్యక్రమంలో ఫారెస్ట్‌ రేంజర్‌ గౌతమ్‌, సెక్షన్‌ అధికారి రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement