నే లారీ నడిపేవాడిని. పక్షవాతం వచ్చి కాళ్లు చేతులు పడిపోయాయి. నలుగురు ఆడ పిల్లలు ఉన్నారు. ఎటూ నడవలేను. ప్రభుత్వ పింఛన్ వస్తే ఆసరా అవుతుందని ఐదేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నా. అప్పటి నుంచి ఎదురుచూస్తున్నా. ప్రభుత్వం కొత్త పింఛన్లు ఇస్తుందని చెప్పడంతో సంతోషమేసింది. కానీ ఇవ్వకపోవడంతో ఎప్పుడిస్తుందోనని ఆందోళనగా ఉంది.
– నిమ్మల అంజయ్య, దివ్యాంగుడు,
ఊకొండి, మునుగోడు మండలం
మూడేళ్ల క్రితం నా భర్త చనిపోతే ఒంటరి మహిల పెన్షన్ కోసం దరఖాస్తు చేసా. ఇప్పటి వరకు పింఛన్ రాలేదు. నాకు ఇద్దరు అమ్మాయిలు. వారి చదువులకు, కుటుంబం గడిచేందుకు భారమవుతోంది. ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేయాలి.
– దీపిక, ఒంటరి మహిళ, నల్లగొండ
కొత్త పింఛన్ల మంజూరుపై మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఆన్‌లైన్ ఆప్షన్ కూడా లేదు. కొత్త పించన్ల కోసం వచ్చిన దరఖాస్తులన్నీ మండల స్థాయిలోనే ఉన్నాయి. దరఖాస్తులు ఆన్‌లైన్ చేసేందుకు ఆప్షన్ ఇచ్చి, అర్హుల జాబితాను తయారు చేయాలని ఆదేశాలు రావాల్సి ఉంది.
– శేఖర్‌రెడ్డి, డీఆర్‌డీఓ


