నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

నిజమైన ఉద్యమకారులకు న్యాయం చేయాలి

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

కట్టంగూర్‌ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2010లో ఉద్యమం తీవ్రంగా ఉన్న సాగుతున్న సమయంలో నాపై పలు రకాల సెక్షన్‌లకు కింద ఆరు కేసులు నమోదు చేశారు. నల్లగొండ, భువనగిరి, హైదరాబాద్‌లోని చర్లపల్లి మొత్తం 18 రోజుల పాటు జైలు జీవితం గడిపాను. ఉద్యమంలో భాగంగా 2007లో తెలంగాణ బార్డర్‌ నుంచి హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌కు వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా నకిరేకల్‌ సమీపంలోకి రాగానే డీసీఎం డీకొట్టడంతో ఆనకు అంగవైకల్యం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తూ అమరుల కుటుంబాలను, ఉద్యమంలో అంగవైకల్యం ఏర్పడిన కుటుంబాలను, జైలు జీవితం గడిపినవారిని ప్రభుత్వ గుర్తించాలి. అంగవైకల్యానికి గురైనవారి కుటుంబాలకు ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 12 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించేందుకు కమిటీ వేయడం హర్షనీయం. రాష్ట్ర ఏర్పాటుకు సుదీర్ఘంగా పోరాటం చేసిన నిజమైన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలి.

– గద్దపాటి దానయ్య, తెలంగాణ ఉద్యమకారుడు

Advertisement
 
Advertisement
Advertisement