7 వరకు రిపోర్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

7 వరకు రిపోర్ట్‌ చేయాలి

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

రామగిరి(నల్లగొండ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో సీటు పొందిన విద్యార్థులు జూన్‌ 7వ తేదీలోపు కళాశాలలో అడ్మిషన్‌ తీసుకోవాలని జోనల్‌ అధికారి విద్యారాణి తెలిపారు. ఇప్పటికే ఫలితాలు విడుదల అయ్యాయని సీటు వచ్చిన వారు ఆయా కళాశాలలో రిపోర్టు చేయాలని పేర్కొన్నారు.

నేడు టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ

నకిరేకల్‌ : నకిరేకల్‌ పట్టణంలో బుధవారం టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా మహసభ నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అద్యక్షుడు గార్లపాటి క్రిష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం స్థానికంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మహాసభకు ప్రతి మండలం, పట్టణం నుంచి జర్నలిస్ట్‌లు తరలి రావాలని కోరారు. జర్నలిస్ట్‌ల సమస్యల పరిష్కారం, హక్కుల కోసం నిరంతరం కృషి చేసే ఏకై క సంఘం ఐజేయు అన్నారు. సమావేశంలో ఆ సంఘం ప్రతినిదులు పులిమామిడి మహేందర్‌, మధనాచారి, శ్రీను, చెరుకు సతీష్‌, రేపాల సతీష్‌, గండమళ్ల రాములు, కందగట్ల శ్రీధర్‌, పరమేష్‌, రాములు, రవీంద్రాచారి, సాయి, రాజు, నర్సింహ, రమేష్‌, శంకర్‌, యాకుబ్‌ తదితరులు పాల్గొన్నారు.

‘బడిబాట’ పాట ఆవిష్కరణ

నల్లగొండ : ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన బోధన, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో రూపొందించిన ‘బడిబాట పాట–2026’ సీడీ, పోస్టర్లను జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంధర్‌రావు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కోశాధికారి ఉదావత్‌ లచ్చిరాం ఈ పాటను రచించారని తెలిపారు. విద్యార్థులను ప్రభుత్వ బడుల వైపు ఆకర్షించేలా ఈ పాట ఉందన్నారు. ప్రభుత్వ విద్యాభివృద్ధికి ఉపాధ్యాయులు చేస్తున్న సజనాత్మక ప్రయత్నాలు మరింత మందికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఉదావత్‌ లచ్చిరాంను డీఈఓ అభినందించారు. కార్యక్రమంలో ఏడీ రామాచారి, ఎస్సీ–ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఈసం రాంబాబు, సిబ్బంది వీరేంద్రసింగ్‌, భిక్షం, శ్రీను పాల్గొన్నారు.

మరో పర్వతారోహణకు బయలుదేరిన అన్వితారెడ్డి

భువనగిరి : ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన పడమటి అన్వి తారెడ్డి.. మరో పర్వతారోహణకు మంగళవారం బయలుదేరి వెళ్లింది. హైదరాబాద్‌కు చేరుకుని అక్కడి నుంచి విమాన మార్గంలో ఉత్తర అమెరికాలోని అలస్కాకు ఈ నెల 3వ తేదీన చేరుకోనుంది. అలస్కాలోఉన్న సుమా రు 6,190 మీటర్ల ఎత్తయిన డేనాలీ పర్వతాన్ని ఎక్కనుంది. ఈ ప్రక్రియ సుమారు నెల రోజులపాటు కొనసాగనుంది. యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణానికి చెందిన అన్వితారెడ్డి 2022 మేలో ఎవరెస్టు పర్వతం, 2022 సెస్టెంబర్‌లో మనస్లూ పర్వతం, 2021 డిసెంబర్‌లో మౌంట్‌ ఎల్‌బ్రోస్‌, 2025 జనవరిలో అర్జెంటీనాలోని అకోన్‌కాగ్వా పర్వతం, 2022 డిసెంబర్‌లో విన్సన్‌ పర్వతం, 2021 జనవరిలో కిలిమంజారో, 2021లో ఫిబ్రవరిలో లడఖ్‌ పర్వతాలను అధిరోహించింది.

Advertisement
 
Advertisement
Advertisement