అంచనాలు దాటని ఆటోమిషన్‌ | - | Sakshi
Sakshi News home page

అంచనాలు దాటని ఆటోమిషన్‌

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

నాగార్జునసాగర్‌ : బహుళార్థసాధక ప్రాజెక్టు నాగార్జునసాగర్‌ గేట్ల రిమోట్‌ ఆటో మిషన్‌ మరమ్మతుల పనులు అంచనాల స్థాయిలోనే ఉన్నాయి. గతంలో ఆంధ్రా అధికారులు డ్యాంపైకి వచ్చి గేట్లను ఎత్తే సమయంలో ఆటోమిషన్‌కు వినియోగించే పరికరాలు భారీ స్థాయిలో ధంసమయ్యాయి. గతేడాది వాటి విడిభాగాలు మార్చకుండా.. రూ.15 లక్షలతో మరమ్మతు పనులు చేపట్టారు. ఈ యేడాది పరికరాలను పూర్తిస్థాయిలో మార్చేందుకు సుమారు రూ.40 లక్షలతో అంచనాలు తయారు చేశారు. ఇంకా అవి ప్రభుత్వానికి చేరలేదు. ఈ నేపథ్యంలో ఈ వానాకాలం నాటికై నా పనులు చేపట్టడం అనుమానంగానే ఉంది.

2016లో ఆటోమిషన్‌ ఏర్పాటు

సాగర్‌ వద్ద గేట్లు ఎత్తి, దించేందుకు 2016లో సాంకేతిక నైపుణ్యతను వినియోగించి ఆటోమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఏ గేటు ఎంత ఎత్తు ఎత్తితే దిగువకు నీరెంత వెళుతుందో కంప్యూటర్‌ స్క్రీన్‌పై కనిపించడంతో పాటు ఆన్‌లైన్‌లో చూసేవిధంగా ఆధునీకరిచారు. అందుకుగాను అప్పట్లో రూ.7 కోట్లు కేటాయించి పనులు చేశారు. 26 రేడియల్‌ క్రస్ట్‌గేట్లతోపాటు కుడి, ఎడమకాల్వలు, సూట్‌గేట్లను రిమోట్‌తోనే ఆన్‌ఆఫ్‌ చేసే విధంగా ఆదునీకరించారు. అందుకుగాను సాగర్‌డ్యాంపై ఈ కంట్రోల్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచే నీటిని విడుదల చేస్తారు. ప్రస్తుతం రిమోట్‌తో లేపితే గేట్లు లేవడం లేదు.

షూట్‌గేట్లు కూడా..

సాగర్‌ డ్యాంలో 510 అడుగుల దిగువకు నీరు వెళ్లిన సమయంలో కృష్ణా డెల్టా అవసరాలకు నీటిని విడుదల చేసేందుకు షూట్‌ గేట్లను వినియోగిస్తారు. జలాశయంలో నీరు నిండుగా ఉండి దిగువకు అధికంగా నీటిని విడుదల చేయాల్సి వచ్చినపుడు కూడా ఈ గేట్లు ఎత్తుతారు. వీటిని కూడా ఆటోమిషన్‌ ద్వారా లేపి దింపే విధంగా అనుసంధానించారు. దీని ద్వారా నీటిని విడుదల చేస్తే కచ్చితత్వం ఉండే అవకాశాలుండడంతో పాటు నీటి నిల్వలు, పారే నీటి గణాంకాలు ఉంటాయి.

ఫ సాగర్‌లో గేట్లు ఎత్తి, దించేందుకు ఆటోమిషన్‌ ఏర్పాటు

ఫ వాటి పరికరాలు మార్చేందుకురూ.40 లక్షలతో అంచనాలు

Advertisement
 
Advertisement
Advertisement