పోరాడి తెలంగాణ సాధించుకున్నాం | - | Sakshi
Sakshi News home page

పోరాడి తెలంగాణ సాధించుకున్నాం

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

నల్లగొండ టూటౌన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అన్యాయాలపై పోరాడి తెలంగాణ సాధించుకున్నామని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌ అన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో నల్లగొండలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం వద్ద రవీంద్రకుమార్‌ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్లాక్‌ టవర్‌లోని అమరవీరుల స్థూపం వద్ద, శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్‌ వలి, చెరుకు సుధాకర్‌, ఏనుగుల రాకేష్‌రెడ్డి, చీర పంకజ్‌మాదవ్‌, రామచంద్రునాయక్‌, పల్లె రవికుమార్‌, మాలే శరణ్యరెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌, జమాల్‌ ఖాద్రి, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఫ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement