పర్యావరణ గ్రామసభలు నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ గ్రామసభలు నిర్వహించాలి

Jun 3 2026 1:21 AM | Updated on Jun 3 2026 1:21 AM

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

నల్లగొండ : ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహిస్తున్న పర్యావరణ వారోత్సవాల సందర్భంగా గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఈనెల 4, 6, 8, 10 తేదీల్లో మండలాల వారీగా గ్రామసభలు, వార్డు సభలు పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మండలాల వారీగా అనుకూలమైన తేదీలను చూసుకోవాలని డీపీఓను ఆదేశించారు. గ్రామసభల్లో బాల్య వివాహాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్రాఉ. ఈ నెల 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, ఆర్డీవో అశోక్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఎస్‌బీఐ ఆర్‌సెటీలో ఉచిత శిక్షణ

నల్లగొండ : ఎస్‌బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాల గ్రామీణ నిరుద్యోగులకు నెల రోజుల పాటు ఏసీ, ఫ్రిడ్జ్‌ రిపేర్‌, సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆర్‌సెటీ డైరెక్టర్‌ సియాజి రాయ్‌ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న నిరుద్యోగులకు శిక్షణ సమయంలో ఉచితవసతి, బోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగులు అర్హత, తదితర పూర్తి వివరాలకు 9701009265 ఫోన్‌ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement