శాలిగౌరారం : తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సీఎం రేవంత్‌రెడ్డి సాకారం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాస్‌నేత అన్నారు. శాలిగౌరారంలో మంగళవారం నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయజెండాను ఎగురవేసి మాట్లాడారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని జైలుకెళ్లిన, ప్రాణత్యాగాలకు పాల్పడిన వారి కుటుంబాలకు సముచిత స్థానం కల్పించకుండా మోసం చేసిందన్నారు. ప్రజా సంకల్పంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు తగిన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అద్యక్షుడు కందాల సమరంరెడ్డి, మార్కెట్ చైర్మన్ పాదూరి శంకర్‌రెడ్డి, వైస్ చైర్మన్ నరిగె నర్సింహ, పీఏసీఎస్ వైస్‌చైర్మన్ చామల మహేందర్‌రెడ్డి, నాయకులు అన్నెబోయిన సుధాకర్, చింత ధనుంజయ్య, షేక్ ఇంతియాజ్, వేముల గోపినాథ్, బొల్లికొండ గణేశ్, బోడ అరుణ్‌కుమార్, జమ్ము అశోక్, పెరుమాండ్ల నరేశ్, పరమేశ్, లక్ష్మయ్య, జయరాజు, భిక్షంరెడ్డి, యుగంధర్‌రెడ్డి, రవి, అంజయ్య, జనార్దన్, వెంకటయ్య, రవీందర్‌రెడ్డి, యాదయ్య, పవన్ పాల్గొన్నారు.


