ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలి

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

మర్రిగూడ : ప్రతి శుక్రవారం డ్రై డేగా నిర్వహించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌ ఆదేశించారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా క్షయ నియంత్రణ అధికారి డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి, మర్రిగూడ వైద్యులతో కలిసి మర్రిగూడలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ దోమలను కట్టడి చేయాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్లు రాహుల్‌, దీప, కృష్ణకుమారి, నగేష్‌, దీపక్‌, శాలిని, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement