రమ్యకు స్పోర్ట్స్‌ సైకిల్‌ అందజేత | - | Sakshi
Sakshi News home page

రమ్యకు స్పోర్ట్స్‌ సైకిల్‌ అందజేత

May 17 2026 7:20 AM | Updated on May 17 2026 7:20 AM

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ మండలం కంచనపల్లికి చెందిన సైక్లింగ్‌ క్రీడాకారిణి నిజానపల్లి రమ్యకు మంత్రి కేటీఆర్‌ స్పోర్ట్స్‌ సైకిల్‌ అందజేశారు. సైక్లింగ్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణి రమ్య.. అంత్యంత ఖర్చుతో కూడుకున్న సైక్లింగ్‌ సామగ్రి కోసం దాతల సాయం కోరింది. ‘సాక్షి’లో ‘సాయం చేస్తే సత్తా చాటుతా’ శీర్షికన ప్రచురితమైన కథనం మాజీ మంత్రి కె.తారకరామారావు దృష్టికి వెళ్లడంతో రమ్యకు సాయం చేస్తానని మాటిచ్చారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో రమ్యకు రూ.13 లక్షల విలువ గల సైకిల్‌తో పాటు స్పోర్ట్స్‌ సామగ్రిని అందజేశారు. పేద కుటుంబానికి చెందిన తాను క్రీడల్లో రాణించేలా ప్రోత్సహించిన కేటీఆర్‌కు రమ్య కృతజ్ఞతలు తెలిపింది. జాతీయస్థాయిలో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తెస్తానని తెలిపింది.

ఎంజీయులో

విద్యా వారోత్సవాలు

నల్లగొండ టూటౌన్‌ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీలో శనివారం విద్యావారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల నాన్‌–టీచింగ్‌, పరిపాలనా సిబ్బంది ఆఫీస్‌ నిర్వహణలో భాగంగా ‘ఏఐ టూల్స్‌’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టాస్క్‌ నుంచి సాయి రాఘవేంద్ర మాట్లాడుతూ ఏఐ ఆధారిత కార్యాలయ ఆటోమేషన్‌, అధికారిక లేఖలు, నివేదికలు, నోటీసుల తయారీ, దత్తాంశ నిర్వహణ, డాక్యుమెంటేషన్‌, స్మార్ట్‌ ప్రజెంటేషన్లు, కంటెంట్‌ సృస్టి, ఈ–మెయిల్‌ కమ్యూనికేషన్‌ వంటి అంశాలపై సమగ్రంగా వివరించారు. కార్యక్రమంలో ఎం.జయంతి, రేఖ, నీలిమ, సునీత, ప్రగతి, నిర్మల, నాగయ్య, హేమంత్‌, ఉమ పాల్గొన్నారు.

ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై అవగాహన

రామగిరి(నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్‌ ప్రాక్టీషనర్‌ సిద్దేశ్వర్‌రావు, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుడు వెంకటరమణ, టీఎస్‌కేసీ మెంటర్‌ ఎండీ.తౌసిఫ్‌, ఇంగ్లిష్‌ విభాగం అధ్యక్షుడు వైవిఆర్‌.ప్రసన్నకుమార్‌ రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ – మెషిన్‌ లెర్నింగ్‌ నిత్యజీవితంలో వీటి ప్రాధాన్యత, పనితీరును వివరించారు. హెల్త్‌కేర్‌లో వ్యాధుల గుర్తింపునకు, వ్యవసాయంలో దిగుబడిని పెంచేందుకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరించే నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి, అధ్యాపకులు జె.నాగరాజు, వెల్దండి శ్రీధర్‌, ఎన్‌.కోటయ్య, ఎ.మల్లేశం, లెఫ్టినెంట్‌ సుధాకర్‌, అనిల్‌ బొజ్జ, జ్యోత్స్న, ఎం.శ్రీనివాస్‌రెడ్డి, బోధనేతర సిబ్బంది, విద్యారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement