ఎండల నుంచి ఉపశమయం పొందేందుకు నల్లగొండలోని పానగల్లు ఉదయ సముద్రం తాగునీటి రిజర్వాయర్‌లో పెద్దలు, యువకులు, చిన్నారులు సైతం ఈతలు కొడుతున్నారు. కొందరు సెల్ఫీలు, రీల్స్ కోసం రిజర్వాయర్ మధ్య వరకు వెళ్లి ప్రమాదాన్ని ఆహ్వానిస్తున్నారు. రిజర్వాయర్ వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, హెచ్చరిక బోర్డులు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రిజర్వాయర్‌లో లోతైన ప్రాంతాలపై అవగాహన లేకుండా ఈతకు దిగడం ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, నల్లగొండ


