జీజీహెచ్‌లో పారిశుద్ధ్యంపై ఫోకస్‌ | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో పారిశుద్ధ్యంపై ఫోకస్‌

Jan 5 2026 7:32 AM | Updated on Jan 5 2026 7:32 AM

జీజీహ

జీజీహెచ్‌లో పారిశుద్ధ్యంపై ఫోకస్‌

పరిసరాల పరిశుభ్రతకు సహకరించాలి

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి (జీజీహెచ్‌)లో పరిసరాల పరిశుభ్రతపై నూతన సూపరింటెండెంట్‌ నర్సింహారావు నేత ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. గతానికి భిన్నంగా ఇటీవల జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌గా బాధ్యతలను చేపట్టిన సూపరింటెండెంట్‌ వైద్య సేవలను పర్యవేక్షించడంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రత్యేక ఫోకస్‌ను పెట్టారు. వార్డులే కాదు ఆస్పత్రి ఆవరణ కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే రోగులు త్వరగా కోలుకుంటారన్నది ఆయన భావన. రోగం వచ్చిన తరువాత ఆస్పత్రికి పోవడం సరికాదు.. రోగం రాకుంగా ముందు చూసుకోవడం ముఖ్యమని ఆస్పత్రి ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రం చేయిస్తున్నారు.

గతంలో వార్డుల్లోనే..

గతంలో పనిచేసిన అధికారులు కేవలం వార్డుల్లో పారిశుద్ధ్యం మెరుగు కోసం చొరవ చూపే వారు. జీజీహెచ్‌ ఆవరణలో పిచ్చిమొక్కలు మొలిచి, ఆస్పత్రికి వచ్చే వారు ఎక్కడ పడితే అక్కడ చెత్తాచెదారం, తినుబండాలను వేయడంతో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉండేది. ఆస్పత్రి వచ్చే వాహనదారులతో పాటు డాక్టర్లు, సిబ్బంది కూడా వాహనాలను ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్‌ చేసేవారు.

ఎక్కడా చెత్త లేకుండా..

నూతన సూపరింటెండెంట్‌ నర్సింహారావు నేత ప్రతి వార్డును రోజూ సందర్శిస్తూ పారిశుద్ధ్యం, మరుగుదొడ్లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తూ సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. వెల్‌నెస్‌ సెంటర్‌, మాతాశిశు ఆరోగ్య కేంద్రం, క్రిటికల్‌ కేర్‌ విభాగం పరిసరాల్లో పిచ్చిమొక్కలను తొలగించి అక్కడ ఎర్రమట్టిని పోయించి డోజర్‌తో చదును చేయిస్తున్నారు. ఆవరణలో ఎక్కడా చెత్తలేకుండా రోజూ రెండు సార్లు శుభ్రం చేయిస్తున్నారు. మంచినీటి ట్యాంకు, క్యాంటిన్‌, రోగుల సహాయకులు ఉండే షెడ్‌ల వద్ద శుభ్రం చేయించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా ప్రత్యేక లైన్‌లను ఏర్పాటు చేసి డాక్టర్లు, సిబ్బంది, ప్రజలు ప్రత్యేక స్థలాలో మాత్రమే పార్కింగ్‌ చేసే విదంగా ప్రత్యేకంగా సెక్యూరిటీ గార్డులను నియమించారు. ఆస్పత్రిలో పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు తీసుకుంటున్న సూపరింటెండెంట్‌ను ప్రజలతో పాటు రోగులు అభినందిస్తున్నారు.

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో వార్డులు మాత్రమే శుభ్రంగా ఉంటే సరిపోదు. ఆస్పత్రి ఆవరణతో పాటు పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలి. అప్పుడే రోగులతో పాటు వారి సహాయకులు ఆరోగ్యంగా ఉంటారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించాలి.

– డాక్టర్‌ గుర్రం నర్సింహారావునేత,

జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌

ఫ ఆస్పత్రి వార్డులతోపాటు పరిసరాలపై దృష్టి పెట్టిన సూపరింటెండెంట్‌

ఫ పారిశుద్ధ్య కార్మికులను పరుగులు

పెట్టిస్తున్న నూతన అధికారి

జీజీహెచ్‌లో పారిశుద్ధ్యంపై ఫోకస్‌1
1/1

జీజీహెచ్‌లో పారిశుద్ధ్యంపై ఫోకస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement