రోడ్డు భద్రత.. అందరి బాధ్యత
నల్లగొండ : రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ముఖ్య లక్ష్యంతో రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వాహనదారుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనతోనే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. మోటర్ వాహనాల చట్టం 1988 ప్రకారం హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా అమలు చేయాలనే ఉద్దేశంతో శ్రీనో హెల్మెట్ – నో పెట్రోల్‌శ్రీ అనే నినాదాన్ని జిల్లాలో అమలు చేస్తున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకే పెట్రోల్ పోయాలని బంక్ యజమానులకు సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటూనే, అవసరమైన చోట కౌన్సిలింగ్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ కమిషనర్ వాణి, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి లావణ్య, ఎస్‌బీ సీఐ రాము, టూటౌన్ సీఐ రాఘవరావు, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్ రెడ్డి, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


