దివ్యాంగులకు క్రీడా పోటీలు
నల్లగొండ: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సోమవారం మహిళా శిశు వికలాంగుల, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో నల్లగొండలో అభినవ్ స్టేడియంలో అండర్–18 క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీలను డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి ప్రారంభించారు. ఈ నెల 3న 18 నుంచి 54 ఏళ్లలోపు దివ్యాంగ పురుషులు, మహిళలకు వివిధ క్రీడాంశాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో మెప్మా పీడీ శ్రీనివాసులు, అక్బర్ అలీ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి విమల పాల్గొన్నారు.


