కళా మహోత్సవ్‌కు విద్యార్థులు
నల్లగొండ టూటౌన్ : హైదరాబాద్‌లోని బొల్లారంలో గల రాష్ట్రపతి నిలయంలో జరిగే భారతీయ కళా మహోత్సవ్ కార్యక్రమానికి జిల్లాకు చెందిన 50 మంది వివిధ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం తరలివెళ్లారు. కళా మహోత్సవ్‌కు వెళ్లే ప్రత్యేక బస్సులను కలెక్టర్ ఇలా త్రిపాఠి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతోపాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, కళలపై అవగాహన పెంచుకోవడానికి విద్యార్థులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో డీఈఓ భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.


