బీఆర్‌ఎస్ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు
పవన్‌వి చెత్త మాటలు
నల్లగొండ టూటౌన్ : బీఆర్‌ఎస్ పార్టీ పుట్టకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ చచ్చుడో అనే తెగింపుతోనే రాష్ట్రం సాధ్యమైందని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి జెప్పాలని కోరారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్, ఎమ్మెల్సీ ఎంసీ.కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్. భాస్కర్‌రావు, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, తిప్పన విజయసింహారెడ్డి, నోముల భగత్‌కుమార్, నాయకులు ఇస్లావత్ రాంచందర్‌నాయక్, పల్లె రవికుమార్, చెరుకు సుధాకర్, మందడి సైదిరెడ్డి, రేగట్టె మల్లికార్జున్‌రెడ్డి, ప్రసన్నరాజ్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి కోనసీమ చెట్లు ఎండిపోయాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ చెత్త మాటలు మాట్లాడుతున్నాడని జగదీష్‌రెడ్డి అన్నారు. పవన్ ఇలాంటి చెత్త మాటలు మాట్లాడవద్దని హితవు పలికారు. తెలంగాణలో సమైక్య రాష్ట్ర ఏజెంట్ ఏలుతున్నాడని వ్యాఖ్యానించారు.
ఫ మాజీమంత్రి జగదీష్‌రెడ్డి


