బాలికలకు అథ్లెటిక్స్ లీగ్
విద్యార్థినుల్లో క్రీడా ప్రతిభను వెలికితీ సేందుకు కేంద్రం ‘అస్మిత ఖేలో ఇండియా’ పోటీలకు శ్రీకారం చుట్టింది
పూర్తిస్థాయి నీటి మట్టం :
590 అడుగులు
ప్రస్తుత నీటి మట్టం : 587.60 అడుగులు
ఇన్‌ఫ్లో : 50,933 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 50,933 క్యూసెక్కులు
విద్యుదుత్పాదన కేంద్రం ద్వారా : 33,779 క్యూసెక్కులు
కుడికాల్వ ద్వారా : 10,000 క్యూసెక్కులు
ఎడమకాల్వ ద్వారా : 5,654 క్యూసెక్కులు
ఏఎమ్మార్పీకి : 1800 క్యూసెక్కులు
వరద కాల్వకు : నిల్
వరిసాగులో చరిత్ర..
వరిసాగులో తెలంగాణ రాష్ట్రం చరిత్ర
సృష్టించిందని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
- 8లో
దేశభక్తిని పెంచడంలో పటేల్ పాత్ర గొప్పది
నల్లగొండ : దేశభక్తిని పెంపొందించడంలో వల్లభాయ్ పటేల్ పాత్ర ఎనలేనిదని రాజ్యసభ సభ్యుడు కేశ్రీ దేవ్ సిన్హా జ్వాల అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బుధవారం నల్లగొండ ఎన్జీ కళాశాల ఆవరణలో ‘యూనిట్ మార్చ్’ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజల్లో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించేందుకు కేంద్ర యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైభారత్, ఎన్‌ఎస్‌ఎస్ సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ నారాయణ్ అమిత్, ఆర్డీఓ వై.అశోక్‌రెడ్డి, డీఎస్‌పీ శివరాంరెడ్డి, జిల్లా క్రీడల యువజన శాఖ అధికారి అక్బర్ అలీ, మై భారత్ స్టేట్ సభ్యులు అనుస్మాన్, ప్రసాద్‌దాస్, యూత్ కో–ఆర్డినేటర్ రాజేష్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.


