
రహదారులకు మహర్దశ
నల్లగొండ–2 కింద ప్రతిపాదనలు..
కొత్త రోడ్లకు ప్రతిపాదనలు
హ్యామ్ కింద అభివృద్ధి, విస్తరణకు నేడు టెండర్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి మోక్షం లభించనుంది. ఇప్పటికీ రోడ్లు సరిగ్గాలేని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతోపాటు ఇరుకు రోడ్ల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోడ్ల నిర్మాణ పనులకు ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా హైబ్రీడ్ అన్యూటీ మోడ్‌లో (హ్యామ్) పద్ధతిలో ఈ పనులను చేపట్టనుంది. వీటికి 40 శాతం నిధులను ప్రభుత్వమే నిర్మాణ దశలో సమకూర్చనుండగా, 60 శాతం నిధులు కాంట్రాక్టు సంస్థలు వెచ్చించనున్నాయి. వీటికి ఈనెల 17న టెండర్లు పిలిచేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది.
జిల్లాలో 60 రోడ్ల అభివృద్ధి, విస్తరణ..
రాష్ట్ర వ్యాప్తంగా హ్యామ్ పద్ధతిలో 17 ప్యాకేజీల కింద 96 నియోజకవర్గాల పరిధిలోని 2,162 రోడ్ల అభివృద్ధి, విస్తరణను 7,449.50 కిలోమీటర్ల పొడవునా చేపట్టనుంది. అందులో మూడు ప్యాకేజీల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 60 రోడ్ల అభివృద్ధికి అవకాశం దక్కనుంది. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో మొత్తంగా 825.28 కిలోమీటర్ల పొడవునా రోడ్ల అభివృద్ధి, విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఇవి కాకుండా మరో ఆరు ప్రాంతాల్లో రూ.560 కోట్లతో కొత్త రోడ్లను నిర్మించనున్నారు.
సర్కిల్–1లో ఐదు నియోజకవర్గాల్లో
రోడ్ల అభివృద్ధి
నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లోని నియోజకవర్గాలను రెండు సర్కిళ్లుగా విభజించి, రెండు ప్యాకేజీలుగా పనులను గుర్తించారు. నల్లగొండ సర్కిల్ పార్ట్–1 కింద 184.72 కిలోమీటర్ల పొడవునా రోడ్లను అభివృద్ధి చేయనుండగా, 38.4 కిలోమీటర్ల పొడవునా డబుల్ రోడ్లుగా విస్తరించనున్నారు. ఇందులో మొత్తంగా నల్లగొండ, మునుగోడు, నకిరేకల్, నాగార్జునసాగర్, తుంగతుర్తి నియోజకవర్గాల్లో అభివృద్ధి, విస్తరణ కలిపి 223.12 కిలోమీటర్ల పొడవునా రోడ్ల పనులను చేపట్టనున్నారు.
సర్కిల్ –2లో ఏడు నియోజకవర్గాల్లో..
నల్లగొండ సర్కిల్–2 పరిధిలో 26 రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. నాగార్జునసాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో రూ.320.80 కోట్లతో 314.66 కిలోమీటర్ల పొడవునా రోడ్ల అభివృద్ధిని చేపట్టనున్నారు.
నల్లగొండ–1 కింద రోడ్ల అభివృద్ధి,
విస్తరణకు ఇచ్చిన ప్రతిపాదనలు..
ఫ మహబూబ్‌నగర్–నల్లగొండ రోడ్డు
15.2 కిలోమీటర్లు
ఫ నల్లగొండ–చౌటుప్పల్ 15 కిలోమీటర్లు
ఫ నల్లగొండ–చౌటుప్పల్ రోడ్డు 42.8 కిలోమీటర్లు
ఫ నల్లగొండ–కట్టంగూర్ రోడ్డు 7.7 కిలోమీటర్లు
ఫ నల్లగొండ–కట్టంగూర్ రోడ్డు 4 కిలోమీటర్లు
ఫ మహబూబ్‌నగర్ రోడ్డు నుంచి తుర్కపల్లి, యాచారం రెండుభాగాలు 13.62 కిలోమీటర్లు
ఫ మహబూబ్‌నగర్ రోడ్డు నుంచి నార్కట్‌పల్లి–నల్లగొండ–నాగార్జునసాగర్ రోడ్డు వరకు రెండు భాగాలు 22.6 కిలోమీటర్లు
ఫ నకిరేకల్–మూసీరోడ్డు (నకిరేకల్, నోముల, వల్లభాపురం)12 కిలోమీటర్లు
ఫ కట్టంగూర్–ఈదులూరు రోడ్డు (కట్టంగూర్, కలిమెర, మునుకుంట్ల, ఈదులూరు) 11 కిలోమీటర్లు
ఫ నకిరేకల్–గురజాల రోడ్డు (కడపర్తి, వల్లాల, అడ్లూరు, శాలిగౌరారం, శాలిలింగోటం, రామగిరి, గురజాల)17.6 కిలోమీటర్లు
ఫ కురుమర్తి–శాలిగౌరారం(ఆకారం)
10.2 కిలోమీటర్లు
ఫ ఈదులూరు–తక్కెళ్లపాడు రోడ్డు 5 కిలోమీటర్లు
ఫ తక్కెళ్లపాడు–మనిమద్దె రోడ్డు (తక్కెళ్లపాడు, ఎన్జీకొత్లపల్లి, మనిమద్దె) 8 కిలోమీటర్లు
డబుల్ రోడ్డుగా విస్తరించేవి ఇవే..
మునుగోడు–కొండాపూర్ రోడ్డు 9.2 కిలోమీటర్లు
ఇడికుడ–నారాయణపురం రోడ్డు 19.2 కిలోమీటర్లు
కచలాపురం–కిష్టాపురం రోడ్డు 10 కిలోమీటర్లు.
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం
60 రోడ్లకు అవకాశం
ఫ మరో ఆరు ప్రాంతాల్లో కొత్తవాటి నిర్మాణానికి ప్రతిపాదనలు
ఫ హైబ్రీడ్ అన్యూటీ మోడ్‌లో
చేపట్టనున్న పనులు
ఫ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో
కొనసాగించేలా కార్యాచరణ
ముకుందాపురం–తుమ్మడం, అడవిదేవులపల్లి వయా నారమ్మగూడెం రోడ్డు 21 కిలోమీటర్లు
సాగర్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రాజవరం రోడ్డు వయా అల్వాల్ క్రాస్‌రోడ్డు(కొమ్మేపల్లి, తిరుమలగిరి మండల కేంద్రం) 14.22 కిలోమీటర్లు
పడమటిపల్లి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి శ్రీశైలం రాష్ట్ర రహదారి వరకు 18.43 కిలోమీటర్లు
మాడుగుల పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి సాగర్ పీడబ్ల్యూడీ రోడ్డు వరకు 9.30 కిలోమీటర్లు
డిండి దేవరకొండ రోడ్డు నుంచి బాపనికుంట రోడ్డు వయా గోనబోయినపల్లి 16 కిలోమీటర్లు
కొత్తపల్లి–అజ్మాపూర్ రోడ్డు వయా ధర్మతండా వరకు 7 కిలోమీటర్లు
కుక్కడం–పాములపహాడ్ వరకు 20 కిలోమీటర్ల రహదారి
బొత్తలపాలెం–రాగడప రోడ్డు(కల్లేపల్లి, తిమ్మాపురం, శాంతినగర్, నర్సాపూర్, రాజగట్టు, పుట్టలగడ్డ)25.65 కిలోమీటర్లు
ముకుందాపురం–తుమ్మడం–అడవిదేవులపల్లి రోడ్డు 8.46 కిలోమీటర్లు
దామరచర్ల–జాన్‌పపహాడ్ రోడ్డు 4.50 కిలోమీటర్లు.
ఫ డిండి నుంచి దేవరకొండ వరకు రూ.108.87 కోట్లతో 34 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేయనున్నారు.
ఫ దేవరకొండ రోడ్డు నుంచి కంబాలపల్లి వరకు రూ.84.87 కోట్లతో 30.90 కిలోమీటర్ల రోడ్డు.
ఫ మల్లేపల్లి–దర్వేశిపురం వరకు రూ.23.89 కోట్లతో 8 కిలోమీటర్ల రోడ్డు.
ఫ మల్లేపల్లి–దర్వేశిపురం రోడ్డులో మరోభాగం రూ.83.25 కోట్లతో 26 కిలోమీటర్ల రోడ్డు.
ఫ నల్లగొండ మెడికల్ కాలేజీ నుంచి అనిశెట్టి దుప్పలపల్లి వరకు బైపాస్ రోడ్డు నాలుగు వరుసలు పది కిలోమీటర్ల మేర రూ.210.03 కోట్లతో నిర్మించనున్నారు.
ఫ మిర్యాలగూడ నుంచి తడకమళ్ల వరకు రూ.50.12 కోట్లతో 15.43 కిలోమీటర్ల మేర కొత్త రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.