
కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీకి పునాదులు
మిర్యాలగూడ : కాంగ్రెస్ పార్టీకి పునాదులు కార్యకర్తలేనని, వారి అభీష్టం మేరకే డీసీసీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఏఐసీసీ పరిశీలకుడు బిశ్వరంజన్ మహంతి అన్నారు. గురువారం మిర్యాలగూడ పట్టణంలోని రాజీవ్ భవన్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే దేశం కోసమని, కాంగ్రెస్‌పై కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు నమ్మవద్దన్నారు. జిల్లాలో మరో ఐదు రోజులు పర్యటించి డీసీసీ అధ్యక్షుడి ఎన్నికకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్ మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృిషి చేస్తుందన్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజవకర్గ అభివృద్ధికి కృషిచేస్తున్నట్లు తెలిపారు. అనంతరం దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వెంకట్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ పరిశీలకుడు బిశ్వరంజన్ మహంతి