ఇందిరమ్మ ఇళ్ల ప్రగతిలో జిల్లాకు రెండో స్థానం
నల్లగొండ: ఇందిరమ్మ ఇళ్ల పురోగతిలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. గురువారం హైదరాబాద్‌లోని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ శాఖ ఎండీ పి.గౌతమ్.. జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కార్యక్రమానికి హాజరైన జిల్లా హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్‌కు ల్యాప్‌టాప్, ప్రశంసాపత్రం అందజేసి సన్మానించారు. అయితే జిల్లాకు మొత్తం 19,625 గృహాలు కేటాయించగా 17,247 మంజూరు చేశారు. ఇప్పటి వరకు 13,581 గృహాలు గ్రౌండింగ్ కాగా వాటిలో 10,116 గృహాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు రూ.80 కోట్లు చెల్లించి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. కాగా మొదటి స్థానంలో నారాయణపేట జిల్లా ఉంది. ఈ సందర్భంగా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం తన క్యాంపు కార్యాలయంలో పీడీ రాజ్‌కుమార్‌ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
ఫ హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్‌కు సన్మానం


