
125 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు
నల్లగొండ: జిల్లా విద్యా శాఖలో 125 మంది ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్ తదితర ఉపాధ్యాయులను కలెక్టర్ అనుమతితో డీఈఓ భిక్షపతి సర్దుబాటు చేశారు. ఈ జాబితాను గురువారం విడుదల చేశారు. ఇటీవల విద్యా శాఖ కమిషనర్ అవసరం ఉన్నచోట ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు అవకాశం కల్పించారు. దీంతో దానికి అనుగుణంగా జిల్లాలో ఎక్కడైతే విద్యార్థుల కంటే ఎక్కువగా ఉపాధ్యాయులు ఉన్నారో వారిని అవసరమున్న చోటకు సర్దుబాటు చేస్తు డిప్యుటేషన్లు ఇచ్చారు. వారందరినీ సంబంధిత పాఠశాలల్లో వెంటనే విధుల్లో చేరాలని సంబంధిత ప్రధానోపాధ్యాయులు వారిని రిలీవ్ చేసేలా ఎంఈఓలు చర్యలు తీసుకోవాలని డీఈఓ ఆదేశించారు.
ఫ జాబితా విడుదల చేసిన డీఈఓ
ఫ వెంటనే రిలీవ్ చేయాలని ఆదేశం
ఫ నిబంధనలకు విరుద్ధంగా చేశారంటున్న యూటీఎఫ్