
20న నల్లగొండలో జాబ్‌మేళా
నల్లగొండ: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈ నెల 20న ఉదయం 10.30 గంటలకు నల్లగొండలోని ఐటీఐ కళాశాల క్యాంపస్‌లో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌సీ నుంచి డిగ్రీ, ఐటీఐ అర్హత కలిగి 18 నుంచి 35 సంవత్సరాల వయసుగల వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు వారి బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో నేరుగా 20వ తేదీన జిల్లా ఉపాధి కల్పన కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు సెల్ :78934 20435 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
నాణ్యమైన పత్తికే మద్దతు ధర
నల్లగొండ: రైతులు అన్ని ప్రమాణాలు పాటించి మార్కెట్‌కు తీసుకొచ్చే నాణ్యమైన పత్తికి మద్దతు ధర చెల్లించనున్నట్టు జిల్లా అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ కోరారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో పత్తి కొనుగోళ్లపై ఆయా శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 5,67,613 ఎకరాల్లో పత్తి పంట సాగైందని, 4.54లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రూ.8,110 మద్దతు ధర కల్పించిందన్నారు. గతంలో కంటే రూ.589 పెంచిందన్నారు. రైతులు మద్దతు పొందేందుకు 8 నుంచి 12 శాతం తేమ మించకుండా పత్తిని మార్కెట్‌కు తెచ్చేందుకు అధికారులు ముందస్తుగా అవగాహన కల్పించాలన్నారు. నాణ్యతలేని పత్తిని సీసీఐ కొనుగోలు చేయదన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు, మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
20న ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు
నల్లగొండ టూటౌన్: ఈనెల 20న నల్లగొండలోని విపస్యా స్కూల్‌లో ఫుట్‌బాల్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 25నుంచి 28 వరకు మహబూబ్‌నగర్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు పంపుతామని పేర్కొన్నారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఆధార్, పాస్ ఫొటోలతో రావాలని కోరారు.
పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
హాలియా, నిడమనూరు : పోషకాహారం తీసుకోవడం ద్వారానే కిశోరబాలికలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని జిల్లా శిశు సంక్షేమ అధికారి కృష్ణవేణి, ఐసీడీఎస్ అనుముల ప్రాజెక్టు అధికారిని ఉదయశ్రీ అన్నారు. అనుముల ప్రాజెక్టు హాలియా సెక్టార్ పరిధిలోని హాలియా–2, నిడమనూరు మండలం ముప్పారం అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ మాసోత్సవంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సుల్లో వారు మాట్లాడారు. చిన్నారులకు చదువుతో పాటు పోషకాహారం కీలకమన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చి న్నారులు, కిశోర బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సదస్సుల్లో హాలియాలో సూపర్‌వైజర్ రమాదేవి, భవిత స్కూల్ టీచర్ వాణి అంగన్‌వాడీ టీచర్లు వజ్రమ్మ, విజయ, నర్మద, మంగమ్మ, శంకరమ్మ, నిడమనూరు మండలం ముప్పారంలో సూపర్‌వైజర్ సైదాబేగం, అంగన్‌వాడీ టీచర్ నాగమణి, హెల్పర్ లింగమ్మ, పంచాయతీ కార్యదర్శి బాలాజీ నాయక్ పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సా యంత్రం వెండిజోడు సేవలను అర్చకులు సంప్రదాయంగా ఊరేగించారు. వేకువజాము నే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠాఅలంకారమూర్తులకు నిజాభిషేకం నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కైంకర్యాలు నిర్వహించారు.

20న నల్లగొండలో జాబ్‌మేళా