
చదువుతోనే ఉజ్వల భవిష్యత్
పెద్దవూర : విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివితేనే ఉజ్వల భవిష్యత్ సాధ్యమని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం ఆమె పెద్దవూరమండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో ముఖా ముఖి మాట్లాడారు. ఇంగ్లిష్ బాషపై పట్టు సాధించాలని సూచించారు.మినీ గురుకులానికి అప్రోచ్ రోడ్డు కావాలని కలెక్టర్‌ను సిబ్బంది కోరగా వెంటనే మంజూరు చేశారు. విద్యార్థుల ఆట వస్తువులకు నిధులు మంజూరు చేశారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయంలో పీఎం ఆవాస్ యోజన ఇళ్లనిర్మాణాలపై సమీక్షించారు. ఆ తరువాత చలకుర్తి జవహర్ నవోదయ విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠం చెప్పారు. ఆమె వెంట గృహనిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, తహసీల్దార్ శాంతిలాల్, ఎంపీడీఓ ఉమాదేవి, ఎంఈఓ రాము తదితరులు ఉన్నారు.
ఎంపీడీఓ నూతన భవన నిర్మాణానికి
ప్రతిపాదనలు పంపండి
తిరుమలగిరి(సాగర్) : ఎంపీడీఓ కార్యాలయ నూతన భవనానికి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి దేశించారు. గురువారం ఆమె తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంపీడీఓ కార్యాలయం పాత పీఏసీఎస్‌సీ భవనంలో అరకొర గదులలో కొనసాగుతుందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె స్పందించి పైవిధంగా మాట్లాడారు. ఆమె వెంట గృహనిర్మాణ శాఖ పీడీ రాజకుమార్, తహసీల్దార్ అనిల్, ఇన్‌చార్జి ఎంపీడీఓ భిక్షం రాజు ఉన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి