
మూడేళ్ల నుంచి బిల్లులివ్వరా..
నల్లగొండ: బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ప్రభుత్వం ఎంపిక చేసిన పేద విద్యార్థులకు విద్యనందించే ప్రైవేట్ పాఠశాలలు యాజ మాన్యాలకు మూడేళ్లుగా బిల్లులు అందక ఆందోళనకు గురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రైవేట్ పాఠశాలల్లో 5వ తరగతి నుంచి పదవ తరగతి వకు రెసిడెన్షియల్, డే స్కాలర్ కింద 1వ తరగతి విద్యార్థులకు విద్యాబోధన అందిస్తుంది. అయితే మూడేళ్ల నుంచి నిధులు విడుదల చేయకపోవడంతో ఆయా పాఠశాలల యాజమాన్యాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి.
12 పాఠశాలల ఎంపిక
జిల్లాలో 12 ప్రైవేట్ పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కీం కింద ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో 5 నుంచి 10వ తరగతి వరకు చదివే రెసిడెన్షియల్ విద్యార్థులకు ఒక్కొక్కరికి సంవత్సరానికి రూ.42 వేలు, నాన్ రెసిడెన్షియల్ విద్యార్థికి రూ.28 వేలు చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే ప్రభుత్వం ఇచ్చే ఈ డబ్బులకు ఆ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద బోధించే పాఠశాలలు ప్రతి విద్యార్థికి ఏటా టెస్ట్ బుక్స్‌తోపాటు నోటుబుక్కులు, రెండు జతల యూనిఫామ్, రెండు జతల షూ ఇవ్వడంతో పాటు వారికి హాస్టల్ వసతి కల్పించి భోజనం అందిస్తున్నాయి. ఆయా పాఠశాలలకు మూడేళ్ల నుంచి ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు చెల్లించకపోవడంతో రూ.6.81 కోట్లకుపైగా పెండింగ్‌లో ఉన్నాయి.
ఫ బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల యాజమాన్యాల ఆవేదన
ఫ రూ.6.81 కోట్ల బకాయిలు వెంటనే ఇవ్వాలని డిమాండ్
ఫ కలెక్టరేట్‌లో సంక్షేమ భవన్ వద్ద ఆందోళన
ఫ ఎస్సీ సంక్షేమ కార్యాలయంలో వినతిపత్రం అందజేత
పాఠశాలలకు పెండింగ్‌లో
ఉన్న బిల్లులు ఇలా.. (రూపాయల్లో..)
సంవత్సరం చెల్లించాల్సిన బిల్లులు
2022–23 70,70,852
2023–24 2,91,67,880
2024–25 3,19,20,000
మొత్తం 6,81,58,732