
దామరచర్లలో ఆందోళన
మిర్యాలగూడ: యూరియా సకాలంలో అందించాలనే డిమాండ్‌తో గురువారం దామరచర్ల మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ తెల్లవారుజామున 3గంటల నుంచే యూరియా కోసం పడిగాపులు కాస్తున్నా పట్టించునే నాథుడే లేడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిల్లిపాది వచ్చి క్యూలైన్‌లో నిల్చొవాల్సిన యూరియా దొరకడం లేదన్నారు. వరినాట్లు పెట్టి నెలరోజులైనా మొదటి విడత యూరియా చల్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇదే పరిస్థితి మరో 15రోజులు కొనసాగితే వరిపంట ఎదుగుదల ఆగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రైతులకు యూరియా అందించాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ పీఎన్‌డి.ప్రసాద్ అక్కడికి వచ్చి ప్రతి రైతుకు రెండు బస్తాలకు టోకెన్లు ఇప్పించి రైతుల రాస్తారోకోను విరమింపజేశారు.