
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో సోమవారం శ్రీలక్ష్మీనరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని వేదమంత్రోచ్ఛరణల నడుమ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోశ్రీ మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం జరిపించారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విగ్వరణం, పంచగవ్య ప్రాశన, మధుఫర్క పూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గరుడ వాహనంపై స్వామి అమ్మవార్లను ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. క్షేత్రంలోని శివాలయంలో గల శ్రీపార్వతీ రామలింగేశ్వర స్వామికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు. అనంతరం మహానివేదనగావించారు.