పంట తొలిదశలోనే తెగుళ్లను నివారిదా్దం | - | Sakshi
Sakshi News home page

పంట తొలిదశలోనే తెగుళ్లను నివారిదా్దం

Sep 2 2025 7:41 PM | Updated on Sep 2 2025 7:41 PM

పంట తొలిదశలోనే తెగుళ్లను నివారిదా్దం

పంట తొలిదశలోనే తెగుళ్లను నివారిదా్దం

గరిడేపల్లి: వివిధ దశల్లో ఉన్న వరి పైర్లకు అగ్గి తెగులు (ఆకుమచ్చ దశ) ఆశించే అవకాశం ఉన్నందున రైతులు తొలిదశలోనే గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలని గడ్డిపల్లి కేవీకే మృత్తిక శాస్త్రవేత్త కిరణ్‌ సూచించారు. వివిధ పంటల్లో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆయన మాటల్లోనే..

● వరిలో అగ్గితెగులు నివారణకు ట్రైసైక్లోజోల్‌ మ్యాంకోజెబ్‌ 2.5గ్రా లేదా ఐసోప్రోథయోలేన్‌ 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

● ప్రధాన పొలాన్ని పొడి దుక్కి దున్ని, నీరు పెట్టి 3–4రోజులు ఉంచి.. వారం రోజులలోపు రోటవేటర్‌తో దమ్ము చేసుకొని నాట్లు వేసుకోవాలి. ఎకరానికి 50కిలోల డీఏపీ దమ్ము తర్వాత మరియు 25కిలోల యూరియా 14కిలోల యూరియా 14కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌ నాట్లు వేసే ముందు వేసుకోవాలి.

● నత్రజని ఎరువును 3–4దఫాలుగా వేయాలి. దమ్ములోనూ, పంట బాగా దుబ్బు చేసే దశలో (25–30 కిలోల యూరియా) మరియు అంకురం తొడిగే దశలోనూ (25–30కిలోలు) బురద పనులో వెదజల్లి 36–48 గంటల తర్వాత పలుచగా నీరు పెట్టాలి.

● రేగడి నేలల్లో పొటాష్‌ ఎరువును ఆఖరి దమ్ములో పూర్తిగా ఒకేసారి వేయాలి. తేలిక భూముల్లో ఆఖరి దమ్ములో సగం (14కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌), అంకురం ఏర్పడే దశలో (14కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) మిగతా సగాన్ని వేయాలి.

● నాట్లు వేసేటప్పుడు ప్రతి 2మీటర్లకు 2అడుగు కాలిబాటలు తీసుకోవాలి. దమ్ము చేయకుండా నేరుగా విత్తినప్పుడు 25శాతం ఎరువును నాటు పద్ధతి కన్నా అధికంగా వేయాలి. మూడు సమాన భాగాలుగా నత్రజని ఎరువును విత్తిన 15–20రోజులకు, పిలక, చిరుపొట్ట దశలో వేయాలి. ఈ పద్ధతిలో 45రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి.

● ప్రధాన పొలంలో కలుపు మొక్కల నివారణకు ఎకరానికి 4కిలోల బెన్సల్ఫూరాన్‌ మిథైల్‌ 0.6శాతం జిఆర్‌, ప్రెటిలాక్లోర్‌ 6శాతం జిఆర్‌ గుళికలను నాటిన 3–5రోజుల్లోపు 20కిలోల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. నేరుగా వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్‌ సీడర్‌ పద్ధతిలో సాగు చేసే రైతులు ఎకరానికి ప్రెటిలాక్లోర్‌, సాపనర్‌ 600–800మి.లీ 3–5రోజుల్లోపు 20కిలోల ఇసుకతో కలిపి చల్లాలి.

● ప్రధాన పొలంలో నాటిన 18–20రోజుల తర్వాత కాండం తొలిచే పురుగు నివారణకు కార్బోఫ్యూరాన్‌ 3సిజీ 10కిలోలు లేదా కార్టాఫ్‌ హైడ్రోక్లోరైడ్‌ 4 సీజీ 8కిలోలు ఇసుకలో కలుపుకొని చల్లాలి.

● వరినాట్లు ఆలస్యమైతే ఉల్లికోడు ఆశించే అవకాశం ఉన్నందున దాని నివారణగా రైతులు కార్బోఫ్యూరాన్‌ 3సిజీ 10కిలోలు ఒక ఎకరానికి చల్లాలి.

పత్తి, కంది సస్యరక్షణ చర్యలు

● పత్తి చేను బెట్ట లేదా అధిక వర్షాలకు గురైనప్పుడు 19–19–19 లేదా 13ః0ః45లాంటి పోషకాలను లీటరు నీటికి 10గ్రా. చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.

● అధిక సాంద్రతలో పత్తిని సాగు చేస్తున్న రైతులు మొక్క పెరుగుదలను, శాఖీయ కొమ్మల పెరుగుదలను అదుపులో ఉంచుకోవాలి. పెరుగుదల నియంత్రణకు మొక్కల 40–50 రోజుల దశలో ఉన్నప్పుడు మెపిక్పాట్‌క్లోరైడ్‌ మందును లీటరు నీటికి 1.2మి.లీ కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. తద్వారా పత్తికాయ సైజు కూడా సమానంగా ఉంటుంది. పత్తిలో తామర పురుగులు, పేనుబంక, పచ్చదోమ నివారణకు ఎసిఫేట్‌ 1.5 గ్రా. లేదా ఎసిటామిప్రిడ్‌ 0.2గ్రా. లేదా థయోమిథాక్సామ్‌ 0.2గ్రా. లేదా ఫిప్రోనిల్‌ 2.0మి.లీ లేదా ఫ్లోనికామిడ్‌ 0.3గ్రా. లేదా ఇమిడాక్లోఫ్రిడ్‌ 0.25మి.లీ లేదా డైఫెన్‌ థయూరాన్‌ 1.22గ్రా. లేదా స్పైనోటోదమ్‌ 0.9 మి.లీ లేదా లోక్సాఫ్లోర్‌ 1గ్రా. లేదా ఎసిఫేట్‌, ఇమిడాక్లోప్రిడ్‌ 2గ్రా. లేదా డైనోటోఫ్యూరాన్‌ 0.4గ్రా. లీటరు నీటికి కలుపుకొని మందులను మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి.

● తెల్లదోమ నివారణకు సల్ఫోక్సాఫ్లోర్‌ 0.6గ్రా. లేదా డైఫెన్థయూరాన్‌ 1.25గ్రా. లేదా బైఫెన్‌ డైఫెన్థయూరాన్‌ 1.25 గ్రా. మందులను లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

● గులాబీ రంగు పురుగు నివారణకు పంట పూత దశ నుండే లింగాకర్షక బుట్టలు ఎకరాకు 4 నుంచి 8 వరకు పెట్టుకోవాలి. గుడ్డి పూలను ఎరివేయాలి. పురుగు తాకిడిని బట్టి మొదటగా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ వేప కషాయం లేదా వేపనూనె 5మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.

● కంది పంటలో అంతరకృషి చేసి కలుపును నివారించి భూమిని గుల్లబారేలా చేస్తే భూమిలో తేమ బాగా నిలిచి బెట్టను కొంత వరకు తట్టుకోగలదు. అంతర కృషి సాధ్యం కాని పరిస్థితుల్లో కలుపు నివారణకు విత్తిన 20రోజులకు ఇమాజితా ఫిర్‌ 300మి.లీ ఎకరానికి అనగా 1.5 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే గడ్డి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు. బెట్ట పరిస్థితుల్లో పేనుబంక ఆశించి మొక్కలు పాలిపోతాయి. దీని నివారణకు 20గ్రా. యూరియా ద్రావణం లేదా 10గ్రాముల మల్టీ కె లేదా పాలిఫీడ్‌ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గడ్డిపల్లి

కేవీకే శాస్త్రవేత్త కిరణ్‌ సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement