
భద్రతా లోపం వల్లే ప్రమాదాలు
నకిరేకల్ : ప్రభుత్వ పాఠశాలలు, మున్సిపల్ కార్యాలయాల్లో భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం నకిరేకల్ జెడ్పీ బాలికల పాఠశాలలో చెత్త శుభ్రం చేస్తూ విద్యుత్ షాక్‌కు గురై నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు మున్సిపల్ కార్మికులు శోభ, వంటెపాక నాగరాజు, సబితను శనివారం ఆయన పరమర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సాయం అందించాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మరోసారి ఇలాంటి ప్రమాదాలు పునరావతం కాకుండా చూడాలన్నారు. ఆయన వెంట నకిరేకల్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, నాయకులు ప్రగడపు నవీన్‌రావు, పల్లె విజయ్, రాచకొండ వెంకన్నగౌడ్, గొర్ల వీరయ్య, గుర్రం గణేష్ తదితరులు ఉన్నారు.
ఫ నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య