
ఓటరు జాబితా.. తప్పులతడక!
జాబితాలో అన్నీ తప్పులే..
నల్లగొండ : గ్రామపంచాయతీ ఓటర్ల జాబితా తప్పులతడకగా మారింది. ఒక గ్రామంలోని ఓట్లు మరొక గ్రామం జాబితాలో చేరగా.. ఒక గ్రామంలో ఒక్కరికే ఐదు, నాలుగు, రెండు ఓట్ల చొప్పున జాబితాలో దర్శనమిచ్చాయి. కాగా ఒక కుటుంబంలోని ఓట్లు వేర్వేరు వార్డుల్లో ఉన్నాయి. దీంతో శనివారం ఎంపీడీఓ కార్యాలయాల్లో నిర్వహించిన పార్టీల సమావేశంలో నాయకులు అభ్యంతాలు వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటరు, పోలింగ్ కేంద్రాల జాబితాను ఈ నెల 28న ప్రకటించింది. ఓటర్ల జాబితాపై శనివారం అభ్యంతరాలు స్వీకరించారు. శుక్రవారం జిల్లాస్థాయిలో కలెక్టర్ ఇలా త్రిపాఠి రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించగా.. జాబితాలో తప్పులు ఉన్నాయని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. శనివారం మండలస్థాయిలో ఎంపీడీఓలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున పొరపాట్లు జరిగినట్టుగా బయటపడింది. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఫ అభ్యంతరం తెలిపిన నాయకులు
మా ఊరిలో జనాభా కంటే ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. గ్రామంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 371 జనాభా ఉంది. 2019 ఎన్నికల్లో 370 మంది ఓటర్లు ఉండగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 400కు పెరిగారు. ప్రస్తుతం ఓటర్ల సంఖ్య 476కు పెరిగింది. ఇళ్లు పెరగలేదు కానీ ఓటర్లు పెరిగారు. పక్క గ్రామమైన చందనపల్లికి చెందిన 30 మంది ఓట్లు ఈ గ్రామం ఓటర్లు జాబితాలో చేరాయి. –శ్రీనివాస్‌రెడ్డి, మాజీ సర్పంచ్,
రెడ్డికాలనీ, నల్లగొండ మండలం