
చెడు వ్యసనాలకు బానిస కావొద్దు
రామగిరి(నల్లగొండ) : యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా సమాజంలో మంచి మనుషులుగా ఎదగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. ఎన్జీ కళాశాలలోని సాంస్కృతిక విభాగం, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్ విభాగాలు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి నాగరాజు ర్యాగింగ్, డ్రగ్స్, గిరిజనుల హక్కులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు నేరాలు, వ్యసనాలను లోనుకాకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒకసారి కేసు నమోదైతే భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం రాదనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. నిరంతరం చదివి మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్, జిల్లా ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి కె.దుర్గావ్రసాద్ లీగల్ సెల్ కార్యదర్శి, జడ్జి వి.వురుషోత్తమరావు, సీఐ బి.ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి చత్రునాయక్, ఎంజీయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ మద్దిలేటి, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు కె.అనంతరెడ్డి, సుదర్శన్, వైస్ ప్రిన్సిపాల్స్ పి.రవికుమార్, శ్రీనివాస్, శ్రీధర్, ఎన్‌సిసి ఆఫీసర్ సుధాకర్, బి.అనిల్‌కుమార్, వెంకటరెడ్డి, ఏ.మల్లేశం, కోటయ్య, శివరాణి, సావిత్రి, అధ్యాపకులు మునిస్వామి, ఎం.అనిల్‌కుమార్, రాంబాబు, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.