
రేషన్ కమీషన్ విడుదల
నల్లగొండ : రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ విడుదల చేసింది. జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించి మొత్తం 997 డీలర్లకు రూ.2 కోట్ల కమీషన్‌ను శనివారం విడుదల చేసింది. జిల్లాలో 997 రేషన్ షాపులు ఉండగా వాటి ద్వారా 5,28,309 కుటుంబాలకు రేషన్ అందుతోంది. రేషన్ పంపిణీ చేసినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం క్వింటాకు రూ.90, కేంద్ర ప్రభుత్వం క్వింటాకు రూ.50 మొత్తం రూ.140 కమీషన్ రూపంలో డీలర్‌కు అందుతుంది. అయితే శనివారం రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ విడుదల చేయగా.. కేంద్రం నుంచి రావాల్సిన కమీషన్ ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంది.
జూన్‌లోనే మూడు నెలల రేషన్..
జూన్, జూలై, ఆగస్టు మాసాలకు సంబంధించి ప్రభుత్వం జూన్ మాసంలోనే పేదలకు బియ్యం పంపిణీ చేసింది. అయితే మూడు నెలల కమీషన్ ఇవ్వడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుండడంతో ఆగస్టు చివరి నాటికి కమీషన్ ఇవ్వకపోతే సెప్టెంబర్ నుంచి రేషన్ షాపులు బంద్ పెట్టి సమ్మె బాట పడతామని డీలర్లు ప్రభుత్వానికి తేల్చి చెప్పారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని వెంటనే కమీషన్‌ను విడుదల చేయాలని విన్నవించారు.
రాష్ట్ర కమీషన్ విడుదల..
రేషన్ డీలర్లంతా సెప్టెంబర్ మాసానికి సంబంధించిన రేషన్ బియ్యం పంపిణీ చేయమని చెప్పడంతో ప్రభుత్వం స్పందించిన ప్రభుత్వం శనివారం జూన్, జూలై, ఆగస్టు నెలకు సంబంధించిన రేషన్ డీలర్ల కమీషన్ రూ.2 కోట్లు విడుదల చేసింది. కానీ, కేంద్రం నుంచి రావాల్సిన కమీషన్ ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా కమీషన్ విడుదల చేసి ఆదుకోవాలని డీలర్లు కోరుతున్నారు.
ఫ డీలర్లకు మూడు నెలల కమీషన్ రూ.2 కోట్లు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఫ కేంద్రం నుంచి రావాల్సిన కమీషన్ ఐదు నెలలుగా పెండింగ్