
బత్తాయి పంట కాపాడుతాం
నల్లగొండ అగ్రికల్చర్ : నల్లగొండ జిల్లాలో బత్తాయి పంటలను కాపాడేందుకు ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ నివేదిస్తామని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అన్నారు. శనివారం ఉదయాదిత్య భవన్‌లో బత్తాయి రైతులు, ఉద్యాన శాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుందామని రైతుల సమస్యలు, అభిప్రాయాలను క్రోడికరించి ఒక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బత్తాయి రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని.. మార్కెట్‌లో దళారీ వ్యవస్థ, సౌకర్యాలు లేకపోవడం, నిర్వహణ లోపం ఉన్నట్లు గుర్తించామన్నారు. బత్తాయి మార్కెట్‌లో అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందన్నారు. జిల్లా కలెక్టర్ అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఏ రకంగా బత్తాయి మార్కెట్‌ను కాపాడవచ్చో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ రైతు కమిషన్ ఆదేశాల మేరకు బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. బత్తాయి రైతులకు లాభం చేకూర్చేలా శాసీ్త్రయమైన పద్ధతిలో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. బత్తాయిని పాఠశాలలు, వసతి గృహాలకు, ఆసుపత్రులకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కొండమల్లేపల్లిలోని ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కమిషన్ సభ్యుడు భూమి సునీల్ మాట్లాడుతూ బత్తాయి రైతులను కాపాడేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి ఆర్థిక చేయూత అందిస్తే బాగుంటుందన్నారు. మరో సభ్యురాలు భవాని మాట్లాడుతూ రైతులు ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రైవేట్‌గా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుపై ఆలోచించాలన్నారు. సభ్యులు వెంకన్న యాదవ్, కెవిఎన్.రెడ్డి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ ఆప్ రీసెర్చ్ సురేష్‌రెడ్డి, రైతులు నంద్యాల నర్సింహారెడ్డి, కర్నాటి లింగారెడ్డి, నూకల వెంకటరెడ్డి, అశోక్‌రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, రాజు, సత్యనారాయణరెడ్డి, వ్యవసాయ శాఖ జేడీ బాబు, అదనపు కలెక్టర్లు జె.శ్రీనివాస్, నారాయణ్ అమిత్, ఉద్యాన ఉప సంచాలకులు సుబాషిని, జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రవణ్, ఛాయాదేవి, గోపాల్, ఆర్డీఓలు అశోక్‌రెడ్డి, రమణారెడ్డి, ఉద్యాన అధికారి పిన్నపురెడ్డి అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం
ఫ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి