
కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం
ఫ పీసీసీ పరిశీలకుడు నసీర్ అహ్మద్
నకిరేకల్ : కాంగ్రెస్‌తోనే పేదలకు న్యాయం జరుగుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పీసీసీ జిల్లా పరిశీలకుడు నసీర్ అహ్మద్ పార్టీ నాయకులకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణంపై నకిరేకల్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ఆవరణలో గురువారం నకిరేకల్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ వారం రోజుల్లో పార్టీ గ్రామ, మండల, బ్లాక్ కమిటీల నియామకం పూర్తి కావాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ ప్రజా సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో నకిరేకల్ మున్సిపల్ చైర్‌పర్సన్ చౌగోని రజితా శ్రీనివాస్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నాగులంచ వెంకటేశ్వరరావు, మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు నకిరేకంటి ఏసుపాదం, లింగాల వెంకన్న, బత్తుల ఊశయ్య, కంపసాటి శ్రీనివాస్, పెద్ది సుక్కయ్య, లక్ష్మీనర్సు పాల్గొన్నారు.
దివ్యాంగ ఓటర్లను గుర్తించాలి
చండూరు : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో దివ్యాంగ ఓటర్లను గుర్తించాలని చండూరు ఆర్డీఓ శ్రీదేవి అన్నారు. దివ్యాంగ ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై గురువారం చండూరు మున్సిపల్ కేంద్రంలో అధికారులతో చండూరు ఆర్డీఓ శ్రీదేవి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో చండూరు డివిజన్ పరిధిలోని తహసీల్దార్లు, చండూరు మున్సిపల్ కమిషనర్, ఎన్నికల డీటీలు, సీడీపీఓ, ఎంఈఓ, రెవెన్యూ సిబ్బంది, వికలాంగ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.