
నిర్వహణ లోపం
మూడు రోజులుగా నీలగిరిలో నీటి సరఫరాకు అంతరాయం
తాగునీటి
ప్రాజెక్టులో
నల్లగొండ టూటౌన్ : నీలగిరి పట్టణంలో మూడు రోజులుగా తాగు నీరు సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు తంటాలు పడాల్సి వస్తోంది. మిషన్ భగీరథ ప్లాంట్‌లో నిర్వహణ లోపం కారణంగా తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. పానగల్ మిషన్ భగీరథ ప్లాంట్‌లో చిన్నపాటి మరమ్మతులు ఏర్పడినా పట్టణ ప్రజలకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఇళ్లల్లో బోర్లు లేనివారు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఎక్కడైనా మరమ్మతులు చేయాల్సి వచ్చినప్పుడు మిషన్ భగీరథ అధికారులు ఆ సమాచారాన్ని నీలగిరి మున్సిపల్ అధికారులకు ఇవ్వకపోవడంతో నల్లగొండ పట్టణంలో నీటి సమస్య ఏర్పడుతోంది. ఒక్కసారి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడితే తిరిగి యథాస్థితికి రావాలంటే మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది. కాగా నీలగిరి మున్సిపాలిటీకి పాలకవర్గం లేకపోవడంతో కొందరు ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
మిషన్ భగీరథ నుంచి
వస్తేనే మున్సిపాలిటీకి నీరు..
పానగల్‌లోని మిషన్ భగీరథ ప్లాంట్ నుంచి ప్రతిరోజు మున్సిపాలిటీకి 25 ఎంల్‌డీ వరకు తాగు నీటిని అందిస్తారు. అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతులు చోటుచేసుకున్నా తాగు నీటి సరఫరాపై ప్రభావం పడుతుంది. మిషన్ భగీరథ ప్లాంట్‌కు కనీసం జనరేటర్ సౌకర్యం, ఎలక్ట్రీషియన్ కూడా లేకపోవడంతో చిన్న మరమ్మతు వచ్చినా చూసేవారు లేక నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. ప్లాంట్‌లోని ప్యానల్ బోర్డులో ఏర్పడిన సమస్య కారణంగా తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు వేగంగా స్పందించని కారణంగా నీలగిరి పట్టణంలో మూడు రోజులపాటు తాగు నీటి సరఫరా నిలిచిపోయింది. కాగా గురువారం నల్లగొండ పట్టణంలోని కొన్ని ప్రాంతాలకు అధికారులు తాగునీరు సరఫరా చేశారు.
ఫ పానగల్ మిషన్ భగీరథ ప్లాంట్ వద్ద మరమ్మతు
ఫ కనీసం ఎలక్ట్రీషియన్ కూడా లేని వైనం
ఫ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు