
ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించాలి
కొండమల్లేపల్లి : ఎరువుల దుకాణదారులు నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయ అధికారి పాల్వాయి శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఎరువుల దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనేటప్పుడు రశీదు తీసుకోవాలని, డీలర్లు విత్తనాలను ఎమ్మార్పీ ధరలకు విక్రయించాలని, రైతులు ఎరువులు కొనుగోలు చేసేసమయంలో విధిగా ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎరువులు విక్రయించే డీలర్లు ఈ–పాస్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలన్నారు. అంతకుముందు పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఏఓ వై.జానకిరాములు, ఏఈఓ, డీలర్లు తదితరలు ఉన్నారు.