
స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ
నల్లగొండ : స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణను యువత సద్వినియోగం చేసుకొని ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పొందవచ్చని సెట్విన్ శిక్షణ సంస్థ నల్లగొండ కో ఆర్డినేటర్ ఎం.సరిత అన్నారు. నలగొండ పట్టణంలోని సెట్విన్ సాంకేతిక శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కోర్సుల్లో శిక్షణ ఇచ్చిన మొదటి బ్యాచ్‌కు బుధవారం పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న ఎడ్యుకేషన్ కోర్సులు, కంప్యూటర్ బేసిక్స్, డీటీపీ, ఎలక్ట్రీషియన్, ప్లంబర్, మొబైల్ రిపేరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్, డిప్లమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, టెక్‌టైల్స్ డిజైనింగ్, కుట్టు మిషన్ తదితర కోర్సుల్లో 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ ఇచ్చామన్నారు. నిరుద్యోగులు, విద్యార్థులు స్వయం ఉపాధి కోర్సులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.